
జూనియర్ ఎన్టీఆర్ గత మూడేళ్లుగా రెస్ట్ లేకుండా ఆర్ఆర్ఆర్ కోసం వర్క్ చేసాడు. అందుకే ఇక ఇప్పుడు రెండు నెలల పాటు రెస్ట్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడట. పూర్తిగా ఈ రెండు నెలలు ఫ్యామిలీ కి టైం కేటాయించి , ఆ తర్వాత కొరటాల శివ డైరెక్షన్లో తన 30 వ చిత్రాన్ని స్టార్ట్ చేయాలనీ చూస్తున్నాడట. ఈ లోపు కొరటాల కూడా చిరంజీవి తో చేసిన ఆచార్య రిలీజ్ లో బిజీ గా ఉండడం , ప్రమోషన్స్ ఇలా అన్ని చూసుకుంటాడని ఎన్టీఆర్ భావిస్తున్నాడట. అలాగే ఈ మూవీ కోసం ఎన్టీఆర్ దాదాపుగా 6 నుంచి 8 కిలోల వరకు బరువు తగ్గబోతున్నారని కొరటాల మూవీలో సరికొత్త మేకోవర్ లో కనిపించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది ఎన్టీఆర్ నటించనున్న 30 వ చిత్రం. నందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ యువ సుధా ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈ మూవీని నందమూరి కల్యాణ్ రామ్ సుధాకర్ మిక్కినేని అత్యంత భారీ స్థాయిలో నిర్మించబోతున్నారు.