Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ ఆ షో నుండి తప్పుకున్నట్లేనా

ఎన్టీఆర్ ఆ షో నుండి తప్పుకున్నట్లేనా

Young-Tiger-Jr.NTR-out-of-Bigg-Boss-season-2ఎన్టీఆర్ మొట్టమొదటిసారిగా బుల్లితెరపై యాంకర్ అవతారం ఎత్తి బుల్లితెర ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్న షో ” బిగ్ బాస్ ” . తెలుగులో మొట్టమొదటగా ఎన్టీఆర్ ఈ షోని హోస్ట్ చేయగా మొదట విమర్శలు వచ్చినప్పటికీ ఆ తర్వాత ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యనం తో టాప్ రేటింగ్ వచ్చింది .బిగ్ బాస్ షో బ్రహ్మాండమైన సక్సెస్ కావడంతో దానికి కొనసాగింపు గా రెండో సీజన్ ని ప్రారంభించాలని భావిస్తున్నారు స్టార్ మా యాజమాన్యం .

అయితే మొదటిసారి యాంకర్ గా చేసిన ఎన్టీఆర్ రెండో సీజన్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది , అయితే ఇది అధికారికంగా తెలియాల్సి ఉంది . ప్రస్తుతం ఎన్టీఆర్ రెండు సినిమాలను ఒప్పుకున్నాడు , ఒకటి త్రివిక్రమ్ తో చేసే సినిమా అది వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది ఇక దాని తర్వాత రాజమౌళి దర్శకత్వంలో చరణ్ తో కలిసి మల్టీస్టారర్ చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నాడు ఎన్టీఆర్ . ఈ రెండు సినిమాలు వరుసగా ఉంటాయి కాబట్టి బిగ్ బాస్ షో చేయడానికి ఎన్టీఆర్ కు వీలు కాదు అందుకే తప్పుకున్నాడని అయితే పూణే లో కాకుండా హైదరాబాద్ లో అయితే తప్పకుండా చేయొచ్చని తెలుస్తోంది . అయితే ఎన్టీఆర్ బిగ్ బాస్ రెండో సీజన్ నుండి తప్పుకున్నాడా ? లేదా ? అన్నది తెలియాలంటే కొద్దిరోజులు వెయిటింగ్ తప్పదు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All