Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ ఆ పని చేయడం లేదట

ఎన్టీఆర్ ఆ పని చేయడం లేదట

యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టార్ హీరోగానే కాకుండా యాంకర్ గా కూడా రాణించిన విషయం తెలిసిందే . తెలుగులో బిగ్ బాస్ రియాలిటీ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించి సక్సెస్ అయ్యాడు దిగ్విజయంగా మొదటి సిరీస్ ని పూర్తిచేసాడు అయితే జూన్ నుండి రెండో సిరీస్  మొదలు కానుందని దానికి కూడా ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించనున్నట్లు వార్తలు వెలువడ్డాయి అయితే అవి వాస్తవం కాదని తెలుస్తోంది ఎందుకంటే మార్చిలో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించనున్న సినిమా సెట్స్ మీదకు వెళుతుంది అది కంప్లీట్ కాకముందే అక్టోబర్ లో ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం ప్రారంభం అవుతుంది .

అంటే ఏ రకంగా చూసినా ఎన్టీఆర్ ఈ ఏడాది చాలా బిజీ అలాంటిది బిగ్ బాస్ సీజన్ 2 ని ఎలా హ్యాండిల్ చేస్తాడు . అందుకే సీజన్ 2 నుండి ఎన్టీఆర్ తప్పుకున్నట్లు తెలుస్తోంది . ఎన్టీఆర్ తప్పుకుంటే సీజన్ 2 కి ఎవరు పనిచేస్తారో చూడాలి . ఎన్టీఆర్ దృష్టి అంతా త్రివిక్రమ్ సినిమా మీదే ఉంది ఎందుకంటే అజ్ఞాతవాసి తో డిజాస్టర్ తీసాడు కదా అందుకే కాస్త టెన్షన్ గా ఉన్నాడు ఎన్టీఆర్ .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All