Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ మరో మల్టీస్టారర్ లో

ఎన్టీఆర్ మరో మల్టీస్టారర్ లో

Three-Nandamuri-actors--Hari-Krishna,-Jr.NTR-and-Kalyanram-in-Pavan-Sadineni-s-filmయంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా చరణ్ తో ఓ మల్టీస్టారర్ చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే . కాగా అది ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే మరో మల్టీస్టారర్ చిత్రంలో ఎన్టీఆర్ నటించనున్నట్లు తెలుస్తోంది అయితే ఈ మల్టీస్టారర్ చిత్రానికి ఓ ప్రత్యేకత ఉంది . ఈ చిత్రంలో ఎన్టీఆర్ తో పాటు నందమూరి కళ్యాణ్ రామ్ అలాగే తండ్రి హరికృష్ణ తో కలిసి నటించనున్నాడట ! యువ దర్శకుడు పవన్ సాధినేని చెప్పిన కథ కళ్యాణ్ రామ్ కు బాగా నచ్చడంతో ఎన్టీఆర్ ని తండ్రి హరికృష్ణ ని ఒప్పిస్తానని అన్నాడట .

ఒకవేళ ఎన్టీఆర్ కనుక ఈ సినిమా చేయడానికి ఒప్పుకుంటే నందమూరి అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోతాయి ఎందుకంటే ముగ్గురి ని ఒకే స్క్రీన్ పై చూడటం అంటే మామూలు సంతోషమా ! అయితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి సమయం పడుతుంది ఎందుకంటే ఎన్టీఆర్ ఇప్పుడు రెండు సినిమాలు చేయాలి ఆ తర్వాతే ఇది సెట్స్ పైకి వెళ్లనుంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All