Homeగాసిప్స్ఎన్టీఆర్ ఎంట్రీ చూస్తే ఫ్యాన్స్ కేక‌లే?

ఎన్టీఆర్ ఎంట్రీ చూస్తే ఫ్యాన్స్ కేక‌లే?

ఎన్టీఆర్ ఎంట్రీ చూస్తే ఫ్యాన్స్ కేక‌లే?
ఎన్టీఆర్ ఎంట్రీ చూస్తే ఫ్యాన్స్ కేక‌లే?

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ బ‌ర్త్‌డే హంగామా ఇప్ప‌టికే మొద‌లైంది. ఈ నెల 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు.  ఫ్యాన్స్ కామ‌న్ డీపీల‌తో సోష‌ల్ మీడియాలో ర‌చ్చ మొద‌లుపెట్టారు. పుట్టిన రోజు వేడుక‌లు మ‌రో ఆరు రోజులే వుండ‌టంతో హంగామా తారా స్థాయికి చేరుతోంది. ఈ పుట్టిన రోజున మూడు స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్‌ల‌ని సిద్ధం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. దిగ్రేట్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి `బాహుబ‌లి` త‌రువాత చేస్తున్న చిత్రం `ఆర్ఆర్ఆర్‌`. మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ తొలిసారి క‌లిసి న‌టిస్తున్నారు.

ఈ చిత్రంలో రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా, యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ కొరంభీంగా క‌నిపించ‌బోతున్నారు. ఇటీవ‌ల రామ్‌చ‌ర‌ణ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా అల్లూరి సీతారామ‌రాజు లుక్‌కి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్‌ని రిలీజ్ చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ఈ వీడియోలో రామ్‌చ‌ర‌ణ్ కి ఎంత అప్లాజ్ వ‌చ్చిందో.. ఈ వీడియోకు వాయిస్ ఓవ‌ర్ అందించిన ఎన్టీఆర్‌పై ఆ స్థాయిలోనే ప్ర‌శంస‌లు కురిశాయి.

- Advertisement -

ఇప్పుడు ఎన్టీఆర్ ట‌ర్న్‌. ఎన్టీఆర్ వీడియోని ఈ పుట్టిన రోజున రిలీజ్ చేయాలి కానీ అందుకు త‌గినంత ఫుటేజ్ లేద‌ని రాజ‌మౌళి ఇటీవ‌ల వెల్ల‌డించ‌డంతో ఫ్యాన్స్ నిరాశ‌కు లోన‌వుతున్నారు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ఎన్టీఆర్ వీడియోని ఇప్ప‌టికే సిద్ధం చేసిన‌ట్టు తెలిసింది. ఈ చిత్రంలో పులితో ఎన్టీఆర్ ఫైట్ చేసే స‌న్నివేశం రోమాంచితంగా వుంటుంద‌ట‌. ఈ సీన్ చూస్తే ఫ్యాన్స్ కేక‌లే అంటున్నారు. ఆ స‌న్నివేశంలోని కొన్ని సీన్స్‌తో ఫ‌స్ట్‌లుక్ టీజ‌ర్‌ని రిలీజ్ చేస్తారా?  లేక ఏ టీజ‌ర్‌తో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి జ‌క్క‌న్న ట్రీట్ ఇవ్వ‌బోతున్నార‌న్న‌ది తెలియాలంటే ఈ నెల 20 వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All