Homeగాసిప్స్భయపడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్

భయపడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్

దర్శకులు త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడు అనగానే ఎన్టీఆర్ తో పాటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా చాలా సంతోషపడ్డారు కానీ అది అజ్ఞాతవాసి చిత్రం రిలీజ్ కి ముందు ఎప్పుడైతే అజ్ఞాతవాసి చిత్రం డిజాస్టర్ అయ్యిందో అప్పటి నుండి ఎన్టీఆర్ ఫ్యాన్స్ త్రివిక్రమ్ తో సినిమా అంటే భయపడిపోతున్నారు , ఇక ఇప్పుడేమో ఆ భయం మరీ ఎక్కువయ్యింది . ఎన్టీఆర్ అభిమానుల్లో భయం ఇంకా పెరగడానికి కారణం ఏంటో తెలుసా ……… ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ల సినిమా మార్చిలో సెట్స్ మీదకు వెళుతుండటమే కారణం .

త్రివిక్రమ్ డిజాస్టర్ సినిమా తర్వాత చేస్తున్న సినిమా కావడంతో ఎన్టీఆర్ కు బ్లాక్ బస్టర్ ఇస్తాడా ? లేక అజ్ఞాతవాసి లాగా డిజాస్టర్ ఇస్తాడా ? అని బాధపడుతున్నారు . అయితే కొంతమంది మాత్రం అజ్ఞాతవాసి ఇచ్చిన షాక్ తో ఎన్టీఆర్ సినిమా కథ పై మరింత శ్రద్ధ పెట్టడం ఖాయమని కాబట్టి తప్పకుండా హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు . చూడాలి ఏమౌతుందో ఎన్టీఆర్ త్రివిక్రమ్ ల సినిమా .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All