Homeటాప్ స్టోరీస్తమిళ మార్కెట్ పై కన్నేసిన ఎన్టీఆర్

తమిళ మార్కెట్ పై కన్నేసిన ఎన్టీఆర్

Ntr eyes on tamil marketయంగ్ టైగర్ ఎన్టీఆర్ తన మార్కెట్ ని మరింతగా పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లున్నాడు అందుకే తమిళ , తెలుగు భాషల్లో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. తెలుగుతో పాటుగా నేరుగా తమిళ్ సినిమా చేయడం ద్వారా అభిమానులను పెంచుకోవడం మాత్రమే కాకుండా మార్కెట్ కూడా పెరుగుతుంది. అలాగే అదనంగా మరో 5 కోట్ల నుండి 30 కోట్ల వరకు అక్కడ రాబట్టవచ్చు అనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో నటించడానికి ఒప్పుకున్నాడట . తమిళంలో అట్లీ స్టార్ డైరెక్టర్ అన్న విషయం తెలిసిందే.

ఇక ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాత అశ్వనీదత్ నిర్మించనున్నారు. ఎన్టీఆర్ కెరీర్ స్వప్న సినిమాతోనే దూసుకుపోయింది. మొదటి చిత్రం ప్లాప్ అయినప్పటికీ స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రంతోనే ఎన్టీఆర్ సక్సెస్ కొట్టాడు . దాంతో అశ్వనీదత్ కోసం మరో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడట . అంతేకాదు శక్తి అనే డిజాస్టర్ సినిమా కూడా వైజయంతి మూవీస్ అశ్వనీదత్ నిర్మించిందే. దానికోసమైనా ఎన్టీఆర్ మరో సినిమా చేయడం ఖాయం. అందుకే అట్లీ తో మాట్లాడారట అశ్వనీదత్ .అయితే ఎన్టీఆర్ -అట్లీ – అశ్వనీదత్ ల కాంబినేషన్లో సినిమా అంటే 2020 లొనే వీలౌతుంది ఎందుకంటే అప్పటి వరకు రాజమౌళి సినిమానే చేయనున్నాడు ఎన్టీఆర్ .

- Advertisement -

English Title: Ntr eyes on tamil market

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All