Homeఎక్స్ క్లూసివ్కళ్యాణ్ రామ్ 118 కోసం ఎన్టీఆర్

కళ్యాణ్ రామ్ 118 కోసం ఎన్టీఆర్

NTR chief guest for Kalyan ram's 118 నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన 118 చిత్రం మార్చి 1 న విడుదల కానుంది దాంతో ఈనెలాఖరున ఆ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఇటీవలే రిలీజ్ అయిన 118 ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది . డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన 118 చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమాగా ఉన్నాడు హీరో కళ్యాణ్ రామ్ .

 

- Advertisement -

ఇక అన్న కళ్యాణ్ రామ్ కోసం తమ్ముడు ఎన్టీఆర్ 118  చిత్ర ప్రమోషన్ కోసం రానున్నాడట . కెరీర్ మొదటి నుండి కూడా కళ్యాణ్ రామ్ హిట్ , ప్లాప్ లతో సంబంధం లేకుండా విభిన్న కథా చిత్రాలను చేస్తున్నాడు . అయితే అందులో విజయాల కంటే అపజయాలు ఎక్కువగా ఉన్నాయి కానీ ఈ 118 చిత్రం మాత్రం తప్పకుండా హిట్ అవుతుందన్న ఆశాభావంతో ఉన్నాడు . నివేదా థామస్ , షాలిని పాండే హీరోయిన్ లుగా నటించిన ఈ చిత్రానికి కెవి గుహన్ దర్శకత్వం వహిస్తుండగా మహేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మించాడు .

 

English Title: NTR chief guest for Kalyan ram’s 118

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All