Homeటాప్ స్టోరీస్సాధారణ చొక్కా తో ఆర్ఆర్ఆర్ సక్సెస్ పార్టీ కి వెళ్లిన ఎన్టీఆర్

సాధారణ చొక్కా తో ఆర్ఆర్ఆర్ సక్సెస్ పార్టీ కి వెళ్లిన ఎన్టీఆర్

NTR casual look
NTR casual look

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాల సింపుల్ గా ఉంటారనే సంగతి తెలిసిందే. సినిమాల్లో కాస్త స్టైలిష్ గా కనిపించిన బయటకు మాత్రం సింపుల్ గా ఉండేందుకే ఇష్టపడుతుంటారు. మూవీ సక్సెస్ మీట్స్ కు కానీ ఏదైనా ఫంక్షన్ కు వెళ్లిన చాల సింపుల్ డ్రెస్ తో వెళ్తుంటాడు. తాజాగా ఈరోజు ముంబై లో జరిగిన ఆర్ఆర్ఆర్ సక్సెస్ మీట్ కు కూడా అలాగే వెళ్లి ఆశ్చర్య పరిచారు.

ఎన్టీఆర్ , రామ్ చరణ్ కలయికలో రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ..మార్చి 25 న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. రెండు వారాలు పూర్తి అయ్యేలోపే వరల్డ్ వైడ్ గా 900 కోట్లు క్రాస్ చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇక నార్త్ లోను వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంది. ఇప్పటికే 200 కోట్లు క్రాస్ చేసి పలు బాలీవుడ్ చిత్రాల రికార్డ్స్ ను బ్రేక్ చేసింది. ఈ తరుణంలో హిందీలో ఆర్ఆర్ఆర్ సినిమాని రిలీజ్ చేసిన పెన్ స్టూడియోస్ జయంతిలాల్ గడ బుధవారం సాయంత్రం ముంబైలో గ్రాండ్ గా పార్టీ ప్లాన్ చేసారు. ఈ ఈవెంట్ చిత్ర యూనిట్ హాజరయ్యారు. కాగా ఈ ఈవెంట్ కు ఎన్టీఆర్ సాధారణ చొక్కా – డెనిమ్ లో సింపుల్ గా కనిపించాడు. ఇది చూసి అంత ఆశ్చర్య పోయారు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All