Homeటాప్ స్టోరీస్వాయిదాపడిన ఎన్టీఆర్ మహానాయకుడు

వాయిదాపడిన ఎన్టీఆర్ మహానాయకుడు

NTR Biopic release post ponedఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా రూపొందుతున్న విషయం తెలిసిందే . మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు కాగా రెండో భాగం ఎన్టీఆర్ మహానాయకుడు . అయితే ఈ రెండు చిత్రాలను కూడా 2019  జనవరి లో విడుదల  చేయడానికి సన్నాహాలు చేసారు అలాగే డేట్స్ కూడా ప్రకటించారు . జనవరి 9న ఎన్టీఆర్ కథానాయకుడు కాగా జనవరి 24 న ఎన్టీఆర్ మహానాయకుడు అని ప్రకటించారు . కట్ చేస్తే ఎన్టీఆర్ మహానాయకుడు విడుదల తేదీ మారింది .

జనవరి 24 న కాకుండా ఫిబ్రవరి 7న ఎన్టీఆర్ మహానాయకుడు విడుదల చేయడానికి సన్నాహాలు చేసున్నారు . ఆమేరకు అధికారికంగా ఫిబ్రవరి 7న విడుదల అని ప్రకటించారు కూడా . క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన విద్యాబాలన్ నటించగా అక్కినేని పాత్రలో సుమంత్ , చంద్రబాబు పాత్రలో రానా , హరికృష్ణ పాత్రలో నందమూరి కళ్యాణ్ రామ్ , సావిత్రిగా నిత్యామీనన్ , శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్ , జయసుధ గా పాయల్ రాజ్ పుత్ తదితరులు నటించారు . అయితే ఈనెల 21 సాయంత్రం ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో వేడుక అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరుగనుంది .

English Title :NTR Biopic release post poned

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All