Homeఎక్స్ క్లూసివ్ఎన్టీఆర్ బయోపిక్ సెన్సార్ టాక్

ఎన్టీఆర్ బయోపిక్ సెన్సార్ టాక్

NTR biopic: NTR Kathanayakudu censor talk ఎన్టీఆర్ బయోపిక్ నిన్న సెన్సార్ కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తిచేసుకుంది . చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు బాలయ్య నటనకు , గెటప్ కు ఫిదా అయ్యారట ! అలాగే మళ్ళీ ఎన్టీఆర్ ని చూసినట్లు ఉందని ,ఆ పాత రోజులను గుర్తుచేశారని ప్రశంసలు కురిపించారట . అంతేనా సినిమాలోని మిగతా నటీనటులు కూడా ఆయా పాత్రలకు చక్కగా సరిపోయారని అద్భుతం చూస్తున్నట్లు అనిపించిందని  మైమరచిపోయామని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారట . ఇక ఈ చిత్రానికి క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ సభ్యులు .

సెన్సార్ సభ్యుల ప్రశంసలు దక్కడంతో పాటుగా బాలయ్య కూడా ఈ సినిమా మొత్తాన్ని ముందుగానే చూసుకున్నారట . సినిమా అద్భుతమైన విజయం సాధించడం ఖాయమని తొడకొట్టి మరీ చెబుతున్నాడట బాలయ్య . జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అవుతున్న ఈ చిత్రం ఒక్క పార్ట్ ఎన్టీఆర్ కథానాయకుడు వంద కోట్ల బిజినెస్ చేసింది . ఇంకా రెండో పార్ట్ అలాగే ఉంది . ఎన్టీఆర్ కథానాయకుడు సూపర్ హిట్ అయితే ఎన్టీఆర్ మహానాయకుడు  రేటు మరింతగా పెంచడం ఖాయంగా కనిపిస్తోంది .

- Advertisement -

English Title : NTR biopic: NTR Kathanayakudu censor talk

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All