Tuesday, March 21, 2023
Homeటాప్ స్టోరీస్'యన్ టి ఆర్' బయోపిక్ వాయిదా పడనుందా?

‘యన్ టి ఆర్’ బయోపిక్ వాయిదా పడనుందా?

Ntr biopic likely to be postponedనందమూరి తారకరామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘యన్ టి ఆర్’ చిత్రాన్ని నందమూరి బాలకృష్ణ నటిస్తూ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి బాగం ‘యన్ టి ఆర్ కథానాయకుడు’ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 9న, రెండవ బాగం ‘యన్ టి ఆర్ మహానాయకుడు చిత్రాన్ని అదే నెల జనవరి 24న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు.

- Advertisement -

అయితే ఈ రెండు చిత్రాలకు మధ్య కేవలం రెండు వారాల గ్యాప్ మాత్రమే ఉండటంతో నందమూరి అభిమానులు ఈ చిత్రం కలెక్షన్స్ మీద ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నారట. దీంతో రెండో బాగాన్ని మరి కొంత సమయం తీసుకొని విడుదల చేయాల్సిందిగా చిత్ర యూనిట్ కు అభిమానులు సూచిస్తున్నట్లు తాజా సమాచారం. మరి ఎంత వరకు “యన్ టి ఆర్ మహానాయకుడు” చిత్రాన్ని చిత్ర యూనిట్ వాయిదా వేస్తుందో లేదో తెలియాల్సి ఉంది.

English Title: Ntr biopic likely to be postponed

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts