Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ పరువు తీయడానికే ఆ సినిమా చేసారా ?

ఎన్టీఆర్ పరువు తీయడానికే ఆ సినిమా చేసారా ?

 NTR biopic creates worst record in telugu film industry ఎన్టీఆర్ తెలుగు జాతి పౌరుషాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు . పరిచయం అక్కర్లేని వ్యక్తి , మహా శక్తి కూడా అయితే అలాంటి మహానుభావుడి చరిత్ర ని ఈనాటి తరానికి చాటిచెప్పలనే సదుద్దేశంతో ఎన్టీఆర్ బయోపిక్ కు శ్రీకారం చుట్టారు కానీ రెండు పార్ట్ లుగా తీసిన బయోపిక్ ఘోర పరాజయం పొందాయి . ఎన్టీఆర్ కథానాయకుడు కనీసం 20 కోట్ల షేర్ అయినా రాబట్టింది కానీ ఎన్టీఆర్ మహానాయకుడు మాత్రం కనీసం అయిదు కోట్ల షేర్ కూడా రాబట్టలేదు .

 

- Advertisement -

దాంతో ఆ సినిమాని కొన్న బయ్యర్లు ఘోరంగా నష్టపోయారు . బయోపిక్ అంటే ఎన్టీఆర్ జీవితంలోని కష్టసుఖాలు అన్నీ ఉండాలి కానీ బాలయ్య క్రిష్ తీసిన బయోపిక్ లో సగం మాత్రమే వాస్తవం ఉంది పైగా సెకండ్ పార్ట్ లో తమ ఇష్టానికి అనుగుణంగా మార్చుకున్నారు చంద్రబాబు పాత్రని ఎలివేట్ చేసారు . ఎన్టీఆర్ చివరి రోజులు కూడా సినిమాలో ఉంటే అది సంపూర్ణమైన బయోపిక్ అయ్యుండేది కానీ బసవతారకం చనిపోయేంత వరకు మాత్రమే చూపించి ఇదే బయోపిక్ అన్నారు అందుకే  జనాలకు నచ్చలేదు . ఎన్టీఆర్ బయోపిక్ అని చెప్పి ఆ మహనీయుడి పరువుని తీయడానికి తీసినట్లుంది తప్ప ఉపయోగం లేకుండాపోయింది . సావిత్రి బయోపిక్ మహానటి ప్రభంజనం సృష్టించింది , వై ఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ యాత్ర హిట్ అయ్యింది కానీ తెలుగుజాతి పౌరుషాన్ని దశ దిశలా వ్యాపింపజేసిన మహనీయుడి బయోపిక్ మాత్రం ఘోర పరాజయాన్ని అందుకొని చరిత్ర పుటల్లో విషాదాన్ని నింపింది .

 

English Title: NTR biopic creates worst record in telugu film industry

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All