Homeగాసిప్స్ఎన్టీఆర్ అంటే భ‌య‌ప‌డుతున్న ఆ ఇద్ద‌రు?

ఎన్టీఆర్ అంటే భ‌య‌ప‌డుతున్న ఆ ఇద్ద‌రు?

ఎన్టీఆర్ అంటే భ‌య‌ప‌డుతున్న ఆ ఇద్ద‌రు?
ఎన్టీఆర్ అంటే భ‌య‌ప‌డుతున్న ఆ ఇద్ద‌రు?

ఎన్టీఆర్ రోల్ అంటే ఇద్ద‌రు హీరోలు భ‌య‌ప‌డుతున్నార‌ట‌. ఆ హీరోలు మ‌రెవ‌రో కాదండోయ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, నంద‌మూరి బాల‌కృష్ణ‌. సావిత్రి జీవిత క‌థ ఆధారంగా నాగ అశ్విన్ రూపొందించిన చిత్రం `మ‌హాన‌టి`, కీర్తిసురేష్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన ఈ బ‌యోపిక్‌లో అక్కినేని పాత్ర‌లో నాగ‌చైత‌న్య న‌టించి ఆక‌ట్టుకున్నాడు. ఎన్‌.టి. రామారావు పాత్ర‌లో న‌టించ‌మ‌ని ఎన్టీఆర్‌ని అడిగితేమాత్రం ఆ పాత్ర త‌ను చేయ‌న‌ని చెప్పేశాడు.

మ‌హాన‌టుడి పాత్ర‌లో తాను చేయ‌లేన‌ని, అది త‌న వ‌ల్ల కాద‌ని స్ప‌ష్టం చేసి తెలివిగా త‌ప్పించుకున్నాడట ఎన్టీఆర్‌. తాజాగా మ‌ళ్లీ నంద‌మూరి తార‌క రామారావు పాత్ర‌లో న‌టించాల‌ని త‌మిళ ద‌ర్శ‌కుడు ఏ.ఎల్‌. విజ‌య్ ఎన్టీఆర్‌ని సంప్ర‌దించిన‌ట్టు తెలిసింది. త‌మిళ‌నాడు దివంగ‌త‌ మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత జీవిత క‌థ ఆధారంగా ఏ.ఎల్‌. విజ‌య్ `త‌లైవి` పేరుతో ఓ బ‌యోపిక్‌ని తెర‌పైకి తీసుకొస్తున్న విష‌యం తెలిసిందే.

- Advertisement -

కంగ‌న ర‌నౌత్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాత‌ల‌తో క‌లిసి విష్ణు ఇందూరి నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం కోసం ఎన్టీఆర్‌ని చిత్ర బృందం సంప్ర‌దిస్తే త‌ను ఆ పాత్ర‌లో న‌టించ‌లేన‌ని ఎన్టీఆర్ తిర‌స్క‌రించిన‌ట్టు తెలిసింది. ఇదే నిర్మాత‌లు బాల‌కృష్ణ‌ను కూడా సంప్ర‌దించార‌ట‌. ఎన్టీఆర్ బ‌యోపిక్ బాక్సాఫీస్ వ‌ద్ద ఆక‌ట్టుకోలేక‌పోయిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యాన్ని దృష్టిలో పెట్టుకుని బాల‌కృష్ణ కూడా సున్నితంగా తిర‌స్క‌రించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All