Homeటాప్ స్టోరీస్జెర్సీ డైరెక్టర్ తో ఎన్టీఆర్ , అల్లు అర్జున్ ?

జెర్సీ డైరెక్టర్ తో ఎన్టీఆర్ , అల్లు అర్జున్ ?

జెర్సీ చిత్రంతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయ్యాడు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి . దాంతో ఈ దర్శకుడికి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది . గౌతమ్ తో పనిచేయడానికి పలువురు హీరోలు పోటీ పడుతున్నారు కూడా . ఇక ఆ లిస్ట్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ , స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది . టాలెంట్ ని ఎంకరేజ్ చేయడమే అల్లు అర్జున్ పని దాంతో జెర్సీ చిత్రాన్ని చూసిన వెంటనే ఆ చిత్ర యూనిట్ పై ప్రశంసలు కురిపించాడు అల్లు అర్జున్ . ఇక పనిలో పనిగా గౌతమ్ ని కూడా ఆకాశానికి ఎత్తేసాడు .

- Advertisement -

అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా గౌతమ్ పై అలాగే హీరో నాని పై ప్రశంసలు కురిపించాడు . అలాగే ఎన్టీఆర్ ని గౌతమ్ తిన్ననూరి కలిసాడు కూడా దాంతో ఎన్టీఆర్ , అల్లు అర్జున్ లు అప్పుడే ఈ దర్శకుడుకి గాలం వేశారు . అయితే ఎన్టీఆర్ ఫ్రీ అవ్వాలంటే 2020 మే వరకు కుదరదు అంటే సంవత్సరం అన్నమాట ! అలాగే అల్లు అర్జున్ కూడా వరుసగా మూడు చిత్రాలను ఒప్పుకున్నాడు అంటే దాదాపు రెండేళ్లు అన్నమాట ! మరి ఈ ఇద్దరిలో గౌతమ్ తిన్ననూరి సినిమా ఎవరితో ఉండనుందో !

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All