
రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్ , రామ్ చరణ్ లు హీరోలు గా నటించిన ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం) భారీ అంచనాల మధ్య గత శుక్రవారం వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాహుబలి సినిమా తో తెలుగు సినిమా సత్తా చాటిన రాజమౌళి , ఆర్ఆర్ఆర్ తో మరోసారి తెలుగు సినిమా స్థాయి ఏంటో చూపించారు. ఇక ఈ మూవీ లో చరణ్ , ఎన్టీఆర్ లు ఇద్దరు కూడా అద్భుతంగా నటించి ప్రసంశలు అందుకుంటున్నారు. ఇక సినిమా పెద్ద సక్సెస్ కావడం తో ఎన్టీఆర్ వరుస ఇంటర్వ్యూ లు ఇస్తూ వస్తున్నారు.
తాజాగా ఎన్టీఆర్ ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ..నటుడిగా నేను ఇప్పటివరకూ చేసిన దానికంటే ఈ సినిమా నా నుంచి ఎంతో శ్రమ కోరుకుంది. ఇది నాకు ఒక కొత్త ఆరంభాన్ని ఇచ్చింది. ట్రిపులార్ సినిమాలో నటించినందుకు గర్వపడుతున్నాను. ఈ సినిమా నాకు చాలా స్పెషల్. ఇకపై నా కెరీర్ గురించి మాట్లాడాలంటే.. అందరూ ‘ఆర్‌ఆర్‌ఆర్’కు ముందు, ఆ తర్వాత అని చెప్పుకొంటారు’ అని తెలిపారు. ఇక మూవీ కలెక్షన్ల గురించి కూడా స్పందించారు. ‘నా దృష్టిలో సినిమా విజయాన్ని నిర్ధేశించేవి మొదట ప్రశంసలు, ఆ తర్వాత రివ్యూలు, చివరిగా కలెక్షన్లు. ఎందుకంటే కలెక్షన్స్‌తో నాకు ఎలాంటి సంబంధం ఉండదు. అయితే.. నంబర్స్ పెరిగితే.. నటీనటులకు మరింత ఆత్మవిశ్వాసం పెరుగుతుంద’ని చెప్పుకొచ్చారు.