
నందమూరి తారకరామారావు మనవడు గా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన జూ. ఎన్టీఆర్..తాతకు తగ్గ మనవడు గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఉన్న అగ్ర హీరోల్లో ఎన్టీఆర్ ఒకరు. విభిన్న కథలతో ఎప్పటికప్పుడు అభిమానులను , ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. తాజాగా రామ్ చరణ్ తో కలిసి రాజమౌళి డైరెక్షన్లో ఆర్ఆర్ఆర్ చేసాడు. ఈ మూవీ గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయం సాధించింది. ఈ క్రమంలో పలు జాతీయ మీడియా చానెల్స్ కు వరుస పెట్టి ఇంటర్వ్యూ లు ఇస్తున్నాడు.
ఈ క్రమంలో ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం ఎప్పుడు అని మీడియా అడుగగా.. “నేను ప్రస్తుతం నా జీవితంలో చాలా చాలా చాలా సంతోషకరమైన దశలో ఉన్నాను. ఒక యాక్టర్ గా ఈ ప్రయాణాన్ని ఆస్వాదించడం ప్రారంభించాను. నేను మొదట దానికే కట్టుబడి ఉండాలనుకుంటున్నాను” అని అన్నారు.
”భవిష్యత్తు ఇప్పటి నుండి పదేళ్లు లేదా ఐదేళ్ల తర్వాత.. భవిష్యత్తు అంటే మీ నెక్స్ట్ సెకన్ అని నమ్మే వ్యక్తిని నేను కాదు. ప్రస్తుతానికి నేను ప్రతీ క్షణాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. నటుడిగా చాలా సంతోషంగా ఉన్నాను. యాక్టింగ్ అనేది నాకు ఎనలేని సంతృప్తినిచ్చే పని ఉంది. ప్రస్తుతానికి ఈ క్షణానికే కట్టుబడి ఉంటాను” అని ఎన్టీఆర్ తెలిపాడు. ఈయన మాటలను బట్టి చూస్తే పాలిటిక్స్ మీద ఆసక్తి కనబరచడం లేదని అర్థం అవుతోంది.