Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ కు ఇంకా హీరోయిన్ దొరకలేదా ?

ఎన్టీఆర్ కు ఇంకా హీరోయిన్ దొరకలేదా ?

రాజమౌళి రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ” ఆర్ ఆర్ ఆర్ ”.  ఎన్టీఆర్ , రాంచరణ్ లు హీరోలుగా నటిస్తున్న విషయం తెలిసిందే . కాగా ఎన్టీఆర్ సరసన బ్రిటిష్ భామ డైసీ ఎడ్గర్ జోన్స్ ని ఎంపిక చేయగా చివరి నిమిషంలో ఆమె హ్యాండ్ ఇచ్చింది దాంతో మళ్ళీ హీరోయిన్ వేటలో పడ్డారు జక్కన్న అండ్ కో . ఎన్టీఆర్ సరసన నటించే భామ కోసం ఒకరు కాదు ఇద్దరు కాదు పెద్ద ఎత్తున వడపోత కార్యక్రమమే జరుగుతోంది కానీ ఎంతకీ హీరోయిన్ అయితే మాత్రం కన్ఫర్మ్ కావడం లేదు . 
 
ఇప్పటికే పలువురు పేర్లు వినబడగా తాజాగా బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ పేరు వినిపిస్తోంది . శ్రద్దా కపూర్ తాజాగా ప్రభాస్ సరసన సాహో చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . శ్రద్దా అయితే ఎన్టీఆర్ కు పర్ ఫెక్ట్ జోడీ అని భావిస్తున్నారట ! ప్రస్తుతం ఇంకా వడపోత కార్యక్రమంలో ఉన్నారు జక్కన్న అండ్ కో . ఇంకా ఏ హీరోయిన్ ని ఫిక్స్ చేయలేదు . ఈ నెలాఖరున ఆర్ ఆర్ ఆర్ మూడో షెడ్యూల్ ఉండొచ్చు ఆలోగా ఎన్టీఆర్ సరసన నటించే భామని సెలెక్ట్ చేయాలనీ భావిస్తున్నారు . 
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All