Homeటాప్ స్టోరీస్నూటొక్క జిల్లాల అందగాడు మూవీ రివ్యూ

నూటొక్క జిల్లాల అందగాడు మూవీ రివ్యూ

నూటొక్క జిల్లాల అందగాడు మూవీ రివ్యూ
నూటొక్క జిల్లాల అందగాడు మూవీ రివ్యూ

మూవీ: శ్రీనివాస్ అవసరాల, రుహాని శర్మ, శివన్నారాయణ. రోహిణి, రమణ భార్గవి తదితరులు
నటీనటులు:
 శ్రీనివాస్ అవసరాల, రుహాని శర్మ, శివన్నారాయణ. రోహిణి, రమణ భార్గవి తదితరులు
దర్శకత్వం: రాచకొండ విద్యాసాగర్
నిర్మాత: శిరీష్, రాజీవ్ రెడ్డి, జాగరముడి సాయిబాబా
రచన: శ్రీనివాస్ అవసరాల
సంగీతం: శక్తికాంత్ కార్తీక్
రేటింగ్: 2.5/5

సెన్సిబుల్ సినిమాలతో అందరినీ ఆకట్టుకున్న శ్రీనివాస్ అవసరాల లైట్ హార్ట్డ్ కామెడీతో మన ముందుకు వచ్చాడు. 101 జిల్లాల అందగాడులో బట్టతలతో సతమతమయ్యే యువకుడి పాత్రలో శ్రీనివాస్ అవసరాల కనిపించాడు. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా.

- Advertisement -

కథ: గుత్తి సూర్యనారాయణ అలియాస్ జిఎస్ఎన్ (శ్రీనివాస్ అవసరాల) ఒక ఇన్ఫ్రా కంపెనీలో పనిచేస్తుంటాడు. మూడు పదుల వయసైనా రాకముందే నెత్తిన జుట్టు ఊడిపోయి బట్టతల వచ్చేయడంతో కాన్ఫిడెన్స్ తగ్గిపోయి విగ్ తో మ్యానేజ్ చేస్తుంటాడు. జిఎస్ఎన్ తన కంపెనీలోనే పనిచేసే అంజలి (రుహాని శర్మ)ని ప్రేమిస్తాడు. సరిగ్గా వారి ప్రేమ ముదిరి పాకాన పడుతున్న సమయంలో జిఎస్ఎన్ బట్టతల విషయం అంజలికి తెలుస్తుంది.

మరిప్పుడు ఆమె ఏం చేస్తుంది? బట్టతల ఉన్నా కూడా జిఎస్ఎన్ ను ఇష్టపడుతుందా లేక వద్దని వెళ్లిపోతుందా?

నటీనటులు: శ్రీనివాస్ అవసరాల ఇలాంటి పాత్రలు అవలీలగా చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అందులో సందేహమే లేదు. 101 జిల్లాల అందగాడు ఇందుకు మినహాయింపేమి కాదు. అయితే ఈ చిత్రంలో ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా మెప్పించాడు. రుహాని శర్మ చూడటానికి బాగుంది. ఆమె నటన కూడా ఓకే. రోహిణి తనకు అలవాటైన పాత్రే కావడంతో బాగానే రాణించింది. శివన్నారాయణ తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేసారు.

సాంకేతిక నిపుణులు: ఫిదా ఫేమ్ శక్తికాంత్ కార్తీక్ అందించిన మ్యూజిక్ అంత ఆకట్టుకునేలా లేదు. అయితే బ్యాక్ గ్రౌండ్ పర్వాలేదు. కొన్ని సీన్స్ ఎఫెక్టివ్ గా ఉన్నాయి. రామ్ సినిమా వర్క్ జస్ట్ ఓకే. కథ పరంగా శ్రీనివాస్ అవసరాల తన స్థాయికి తగ్గ కథను అందించలేకపోయాడు. బాలీవుడ్ చిత్రాలు బాల, ఉజ్దా చమన్ ఛాయలు ఈ చిత్రంలో బాగా కనిపిస్తున్నాయి. స్క్రీన్ ప్లే ఇంకా ఎఫెక్టివ్ గా ఉండొచ్చు. దర్శకుడిగా రాచకొండ విద్యాసాగర్ పర్వాలేదు అనిపించినా తన నరేషన్ బాగా స్లో అయింది. కామెడీ పండించే స్కోప్ ఉన్న సన్నివేశాలను కూడా వృథా చేసుకున్నారు.

చివరిగా: 101 జిల్లాల అందగాడు, సోసోగా అనిపించే డ్రామా. ఈ చిత్రంలో ప్రధానంగా కామెడీ ఆశించే వెళితే నిరాశ తప్పదు. అక్కడక్కడా కొన్ని నవ్వులు కొంత ఉపశమనం. అయితే ఎమోషనల్ కంటెంట్ మరీ భారంగా అనిపిస్తుంది. మొత్తంగా 101 జిల్లాల అందగాడు జస్ట్ యావరేజ్.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All