Homeగాసిప్స్అలీ రెజా ఇదంతా ఫ్రీగా చేస్తున్నాడా?

అలీ రెజా ఇదంతా ఫ్రీగా చేస్తున్నాడా?

అలీ రెజా ఇదంతా ఫ్రీగా చేస్తున్నాడా?
అలీ రెజా ఇదంతా ఫ్రీగా చేస్తున్నాడా?

బిగ్ బాస్ సీజన్ 3 మొదటి వారాల్లో ఈ సీజన్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరు అంటే అటు ప్రేక్షకుల్లో ఇటు హౌజ్ మేట్స్ లో ప్రముఖంగా వినిపించిన పేరు అలీ రెజా. టివి నటుడైన అలీ రెజా, టాస్క్ లు పెర్ఫర్మ్ చేయడంలో, గొడవలు పడడంలో ముందుంటాడు. ఎప్పుడూ యాక్టివ్ గా కనిపించే అలీ రెజాకు క్రమంగా అందరూ ఫ్యాన్స్ అవ్వడం మొదలుపెట్టారు. అందుకే ఆరు వారాల పాటు అసలు నామినేషన్స్ లో లేకుండా నెట్టుకొచ్చేసిన అలీ రెజా, ఏడవ వారం ముగిసేసరికి ఎలిమినేట్ అయిపోయాడు. అలీ రెజా ఎలిమినేట్ అవ్వడం బిగ్ బాస్ లో షాక్ అని చెప్పవచ్చు. తన పేరు రాగానే హిమజ, శ్రీముఖి, శివ జ్యోతి ముఖాలు చూస్తే అతనెంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ అర్ధం చేసుకోవచ్చు.

అయితే నామినేట్ అయిన తొలిసారే ఎలిమినేట్ అయిన అలీ రెజా వెళ్ళిపోతున్నప్పుడు శ్రీముఖి, శివ జ్యోతి గుక్కలు పడి, పోటీ పడి, వెక్కి వెక్కి ఏడ్చారు. ఆ ఏడుపులకు నాగార్జున కూడా ఎమోషనల్ అవ్వాల్సి వచ్చింది. అయితే అందరి ఫేవరెట్ కంటెస్టెంట్ గా ఇంటి నుండి బయటకు వెళ్లిన అలీ రెజా, కొన్ని వారాలకే రీఎంట్రీ ఇచ్చాడు.

- Advertisement -

అలీ వెళ్ళినప్పుడు బాధపడ్డ హౌజ్ మేట్స్ కళ్ళల్లో వచ్చిన తర్వాత అంత ఆనందం కనిపించలేదు. వచ్చినప్పుడు సంతోషంతో ఎగిరిగంతేశారు కానీ తర్వాత్తర్వాత అలీ ప్రవర్తనపై విసుగు మొదలైంది. ముఖ్యంగా అలీ బాబా భాస్కర్ ను టార్గెట్ చేసిన తీరు చాలా మందికి నచ్చలేదు. ఇంతకీ అసలు ఓటింగ్ కూడా లేకుండా అలీ బిగ్ బాస్ లోకి రీ ఎంట్రీ ఎలా ఇచ్చాడన్న సందేహాలు అందరిలో కలిగాయి. దీనికి సమాధానంగా తెలిసిందేంటంటే సాధారణంగా హౌజ్ లోకి వచ్చిన వాళ్లందరికీ వారి వారి రేంజ్ బట్టి పేమెంట్స్ ఉంటాయి. వారు హౌజ్ లో ఎన్ని రోజులుంటే దాన్ని బట్టి లెక్కగట్టి ఆ కంటెస్టెంట్ కు ఇంత అని ముట్టజెప్పుతారు.

అలీ 50 రోజులు హౌజ్ లో ఉన్నందుకు దానికి తగ్గ పారితోషికం అందుకోవాలి. అయినా రీ ఎంట్రీ ఇచ్చాడుగా అంటే అలీ ఒక కండిషన్ మీద రీ ఎంట్రీ ఇచ్చాడట. అదే రీ ఎంట్రీ తర్వాత బిగ్ బాస్ లో ఉన్న రోజులకు అలీకి పేమెంట్ ఉండదు. 50 రోజులకే అలీకి పేమెంట్ అందుతుంది. ఈ రకమైన అగ్రిమెంట్ పై సైన్ చేసిన తర్వాతే అలీకి ఓటింగ్ సమస్య లేకుండా బిగ్ బాస్ లోకి రీ ఎంట్రీ ఛాన్స్ ఇచ్చారు. అదనంగా ఫేమ్ వస్తుందని అలీ ఈ డీల్ కు ఓకే చెప్పాడు.

అయితే రీ ఎంట్రీకి ముందు హీరోలా కనిపించిన అలీ రెజా, రీ ఎంట్రీ తర్వాత తనకొచ్చిన ఫేమ్ ను పూర్తిగా పాడుచేసుకున్నాడు. ఇప్పుడు హౌజ్ లో వీక్ కంటెస్టెంట్ గా అలీ గురించి చెప్పుకోవచ్చు. అలాగే ముందు బాగా సపోర్ట్ చేసిన శ్రీముఖి, శివ జ్యోతి కూడా ఇప్పుడు అలీకి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా లేరు. బయట జనాల్లో కూడా ఇదివరకు లేని నెగటివిటీ ఏర్పడింది. అదనపు ఫేమ్ కోసం ప్రయత్నించి ఉన్నది కూడా పోగొట్టుకున్నాడు అలీ రెజా.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All