Homeఎక్స్ క్లూసివ్ఎన్టీఆర్ సినిమాకు ఎన్టీఆర్ ఎందుకు రాలేదు

ఎన్టీఆర్ సినిమాకు ఎన్టీఆర్ ఎందుకు రాలేదు

No invitation for Jr NTR from balakrishna ఎన్టీఆర్ బయోపిక్ లో భాగమైన ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రానికి జూనియర్ ఎన్టీఆర్ రాలేదు దాంతో ఆ ప్రచారం ఎక్కువయ్యింది . ఎన్టీఆర్ కథానాయకుడు చిత్ర ప్రీమియర్ షోలకు నందమూరి కుటుంబం మొత్తం హాజరయ్యింది అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం రాలేదు దాంతో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అవుతోంది ఈ విషయం . బాలయ్య బాబాయ్ నటించిన ఈ సినిమాకు నందమూరి కుటుంబంతో పాటుగా పలువురు సినీ ప్రముఖులు వచ్చారు .

కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం రాలేదు , అంతేకాదు కనీసం ట్వీట్ కూడా చేయలేదు . బయోపిక్ ఎలా ఉంది , బాలయ్య బాబాయ్ ఎలా చేసాడు ? అనే ట్వీట్ కూడా చేయలేదు దాంతో మళ్ళీ ఎన్టీఆర్ నందమూరి కుటుంబానికి దూరమైనట్లేనా ? అన్న మాట వినిపిస్తోంది . ఎన్టీఆర్ ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాడు మరి . ఒకవేళ అందరి ముందుకు ఎన్టీఆర్ రావడం ఇష్టం లేదా ? లేక బాలయ్య ఎన్టీఆర్ ని పిలవలేదా ? ఏమో ! లోగుట్టు పెరుమాళ్ళకెరుక !

- Advertisement -

English Title: No invitation for Jr NTR from balakrishna

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All