Homeఎక్స్ క్లూసివ్ఎఫ్ 2 పరిస్థితి ఏంటి ?

ఎఫ్ 2 పరిస్థితి ఏంటి ?

No expectations on F2
Varun Tej and Venkatesh

మొన్న ఎన్టీఆర్ కథానాయకుడు రిలీజ్ అయ్యింది సినిమా ఓకే , నిన్న రజనీకాంత్ పేట చిత్రం రిలీజ్ అయ్యింది ఈ సినిమాకు థియేటర్ లు లేవు అలాగే ప్లాప్ టాక్ వచ్చేసింది . ఇక ఈరోజు రాంచరణ్ నటించిన వినయ విధేయ రామ చిత్రం విడుదల అయ్యింది ఈ సినిమా కు డిజాస్టర్ టాక్ వచ్చింది . ఇక రేపు వెంకటేష్ , వరుణ్ తేజ్ లు నటించిన ” ఎఫ్ 2 ” విడుదల అవుతోంది మరి ఈ సినిమా పరిస్థితి ఏంటో రేపు తెలిసిపోనుంది .

ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేకుండాపోయాయి . టీజర్ , ట్రైలర్ కూడా అంతగా ఇంప్రెసివ్ గా లేకపోవడంతో అడ్వాన్స్ బుకింగ్ కూడా ఆశాజనకంగా లేవు . కనీసం హైదరాబాద్ లోని మల్టీప్లెక్స్ లలో నైనా ఓ మోస్తరుగా అడ్వాన్స్ బుకింగ్స్ ఉంటాయని అనుకున్నారు కానీ ఆ పరిస్థితి అయితే లేదు . అనిల్ రావిపూడి దర్శకుడు కాబట్టి మినిమమ్ గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది ఎందుకంటే అనిల్ దర్శకత్వం వహించిన పటాస్ , సుప్రీమ్ , రాజా ది గ్రేట్ ఈ మూడు చిత్రాలు కూడా హిట్స్ అయ్యాయి దాంతో ఎఫ్ 2 పై కాస్త అంచనాలు అయితే ఉన్నాయి . అయితే అసలు విషయం మాత్రం రేపు తేలిపోనుంది .

- Advertisement -

English Title: No expectations on F2

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All