Homeఎక్స్ క్లూసివ్బాలయ్య సినిమాకు కష్టాలు తప్పవా ?

బాలయ్య సినిమాకు కష్టాలు తప్పవా ?

No buzz on NTR mahanayakudu నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఎన్టీఆర్ మహానాయకుడు ఈనెల 22 న విడుదలకు సిద్ధమైంది . ఎన్టీఆర్ కథానాయకుడు ఘోర పరాజయం పొందడంతో ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రానికి పెద్దగా బజ్ లేకుండా పోయింది . దానికి తోడు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ యాత్ర చిత్రం హిట్ కావడంతో ఎన్టీఆర్ మహానాయకుడు పై మరింతగా నీలి నీడలు కమ్ముకున్నాయి .

 

- Advertisement -

నిజానికి ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్నో సంచలన విషయాలు ఉన్నాయి కానీ వాటిని డైల్యూట్ చేసే విషయాలు కూడా ఉన్నాయి పైగా బాలయ్య రూపొందిస్తున్న ఈ బయోపిక్ లో వెన్నుపోటు తో పాటుగా ఇతర అంశాలను వీళ్లకు నచ్చినట్లుగా చూపిస్తున్నారు దాంతో ప్రేక్షకులకు ఆసక్తి లేకుండాపోయింది . పైగా ఈనెల 22 న అడల్ట్ కంటెంట్ తో వస్తున్న సినిమాలు కూడా ఉన్నాయి . ఈరోజుల్లో సినిమాలను ఎక్కువగా చూసేది యువత కాబట్టి వాళ్లకు ఎన్టీఆర్ మహానాయకుడు పై అంతగా ఆసక్తి లేదు . ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఎన్టీఆర్ మహానాయకుడు విజయం సాధించడం అంటే కష్టమే ! ఒకవేళ హిట్ అయితే సంచలనమే !

English Title: No buzz on NTR mahanayakudu

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All