Homeటాప్ స్టోరీస్హ్యాపీ వెడ్డింగ్ పై అంచనాలు లేవు

హ్యాపీ వెడ్డింగ్ పై అంచనాలు లేవు

no buzz for niharikas happy weddingసుమంత్ అశ్విన్నిహారిక జంటగా నటిస్తున్న చిత్రం ” హ్యాపీ వెడ్డింగ్ ” . ప్రేమ – పెళ్లి ల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 28న విడుదలకు సిద్ధమైంది అయితే ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేకుండా పోయాయి . లక్ష్మణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ సంస్థ నిర్మించింది . మెగా డాటర్ నిహారిక హీరోయిన్ గా నటించిన చిత్రం కావడంతో చరణ్ తో పాటుగా అల్లు అరవింద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందజేశారు .

ఒక మనసు చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన నిహారిక కు ఆ సినిమా పెద్ద షాక్ ఇచ్చింది . మొదటి సినిమానే పెద్ద పరాజయాన్ని అందించడంతో చాలా కథలు విన్నప్పటికి అవన్నీ తిరస్కరించింది కట్ చేస్తే లక్ష్మణ్ చెప్పిన కథ నచ్చడంతో మళ్ళీ కెమెరా ముందుకు వచ్చింది . ఇక హీరో సుమంత్ అశ్విన్ ఈ హీరోకు కూడా హిట్ కావాలి అందుకే పెళ్లి నేపథ్యంలో తెరకెక్కిన చిత్రంతో యువత ని ఆకట్టుకోవచ్చని ప్రయత్నం చేసారు . అయితే చరణ్ , అల్లు అరవింద్ లు వచ్చినప్పటికీ ఈ సినిమాకు రావాల్సినంత క్రేజ్ అయితే రాలేదు . మరో అయిదు రోజుల్లో సినిమా విడుదల కార్యక్రమం ఉంది . మరి ఈ రెండో సినిమా అయినా నిహారిక కు హిట్ ఇస్తుందా ? లేదా ? చూడాలి .

- Advertisement -

English Title: no buzz for niharikas happy wedding

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All