Homeటాప్ స్టోరీస్సూర్య ఈటీ రిలీజ్ అవుతున్నట్లు కూడా తెలియడం లేదు..

సూర్య ఈటీ రిలీజ్ అవుతున్నట్లు కూడా తెలియడం లేదు..

NO buzz ET
NO buzz ET

ఆకాశమే నీ హద్దురా , జై భీమ్ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న సూర్య..ఇప్పుడు ఈటీ మూవీ తో రేపు ( మార్చి 10 న ) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. డిఫరెంట్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని పాండురాజ్ డైరెక్ట్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ హిందీ కన్నడ మలయాళ భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. తెలుగులో ”ఈటీ” (ఎవరికీ తలవంచడు) పేరుతో రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమా రేపు రిలీజ్ అవుతున్నట్లు కూడా చాలామందికి తెలియడం లేదు.

దీనికి కారణాలు రెండు. ఒకటి సినిమా ప్రమోషన్ లేకపోవడం, రెండోది మార్చి 11 న రాధే శ్యామ్ రిలీజ్ ఉండడం. సూర్య నటించిన గత రెండు చిత్రాలు ఓటిటి లో రిలీజ్ అయ్యి విజయం సాధించాయి. అంతకు ముందుకు చిత్రాలు థియేటర్స్ లలో విడుదలైనప్పటి ప్లాప్స్ అయ్యాయి. దీంతో సూర్య మార్కెట్ పూర్తిగా డౌన్ అయ్యింది. సూర్య సినిమా అంటే థియేటర్స్ లలో చూసేందుకు పెద్దగా ఇంట్రస్ట్ చూపించడం లేదు. దీంతో ఈటీ సినిమా గురించి ఎవరు పెద్దగా మాట్లాడుకోవడం లేదు..అంతే కాకుండా సినీ జనాలంతా రాధే శ్యామ్ మేనియా లో ఉన్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పడు వస్తుందా అనే ఆతృతలో ఉండడం తో ఈటీ ని పట్టించుకునే నాధుడు కరువయ్యాడు. రేపు సినిమా రిలీజ్ అవుతున్నాకాని బుక్ మై షో లో టికెట్స్ కనీసం 25 % కూడా బుక్ కాలేదట. రిలీజ్ రోజు థియేటర్స్ భారీగానే ఉన్న తెల్లారి అన్ని కూడా రాధేశ్యామ్ కు వెళుతున్నాయి. ఇలా ఈటీ కి అన్ని మైనస్ లు ఉన్నాయి. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All