Homeటాప్ స్టోరీస్జనాలు లేక వెలవెలబోయిన ఆఫీసర్ థియేటర్లు

జనాలు లేక వెలవెలబోయిన ఆఫీసర్ థియేటర్లు

no audience in officer theaters ,nagarjuna shocked with officer resultనాగార్జున నటించిన ఆఫీసర్ చిత్రానికి డిజాస్టర్ టాక్ రావడంతో మొదటి రోజునే ఆ సినిమాని చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడలేదు ఇక నిన్న నైతే మరీ దారుణంగా ఉంది పరిస్థితి , ఆఫీసర్ చిత్రాన్ని ప్రదర్శిస్తున్న థియేటర్ లన్ని ఖాళీ గా జనాలు లేక వెలవెల బోయాయి . ఇక ఈరోజు ఆదివారం కావడంతో ఈరోజైనా ప్రేక్షకులు రాకపోతారా అని ఆశపడుతున్నారు కానీ ఆ ఆశ అడియాసే ఎందుకంటే మొన్న విడుదలైన చిత్రాల్లో అభిమన్యుడు బాగుందని టాక్ రావడంతో ఆ సినిమాకు వెళుతున్నారు లేదంటే మహానటి , రంగస్థలం చిత్రాలకు వెళ్తున్నారు .

నాగార్జున కెరీర్ లోనే అత్యంత డిజాస్టర్ గా పేరు తెచ్చుకుంది ఆఫీసర్ చిత్రం . వర్మ రికార్డ్ పరమ చెత్తగా ఉన్నప్పటికీ నాగార్జున అతడ్ని నమ్మి సినిమా చేయడం ముమ్మాటికీ నాగార్జున చేసిన తప్పని అంటున్నారు అభిమానులు అలాగే విశ్లేషకులు . మొదటి రోజున 44 లక్షల షేర్ ని రాబట్టి అందరికీ షాక్ ఇవ్వగా నిన్న రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి పది లక్షల షేర్ కూడా రాలేదంటే ఆఫీసర్ చిత్రం ఎంత దయనీయంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు . మొత్తానికి ఈ సినిమాకు ఇచ్చిన థియేటర్ వాళ్ళు ఈగలు తోలుకుంటూ నిట్టూర్పులు విడుస్తున్నారు . ఆఫీసర్ డిజాస్టర్ కావడంతో నాగార్జున తీవ్ర షాక్ కి గురయ్యాడట ! వర్మ ని నమ్మి ఘోరమైన తప్పు చేసానని ఫీల్ అవుతున్నాడట నాగార్జున .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All