Homeటాప్ స్టోరీస్వాల్మీకి లో భీష్మ మెరుపులు

వాల్మీకి లో భీష్మ మెరుపులు

Varun Tej And Nithin
వాల్మీకి లో భీష్మ మెరుపులు

టైటిల్ చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి. వరుణ్ తేజ్ పూర్తి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించిన చిత్రం వాల్మీకి. సినిమా విడుదలకు ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో వరుణ్ తేజ్ చిత్ర ప్రమోషన్లను పెంచేసాడు. మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ, ప్రోమోలు విడుదల చేస్తూ వాల్మీకి చిత్రానికి ఓపెనింగ్స్ మంచిగా రావడానికి తానేం చేయాలో అంతా చేస్తున్నాడు. తాజాగా వాల్మీకి చిత్రంలోని మరో విశేషాన్ని ప్రేక్షకులతో పంచుకున్నాడు వరుణ్.

ఈ చిత్రంలో నితిన్ కామియో పాత్రలో మెరవనున్నాడట. ఈ విషయాన్ని ట్విట్టర్ లో తెలియజేసాడు వరుణ్. వాల్మీకిలో అదిరిపోయే కామియో పాత్రలో మెరిసినందుకు భీష్మ నితిన్ కు థాంక్స్ అని పోస్ట్ చేసాడు. దానికి నితిన్, వాల్మీకి చిత్రంలో నేను కూడా భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. సెప్టెంబర్ 20న గత్తర్ లేపాల అని ట్వీట్ చేసాడు. న్యూస్ అయితే బయటకి వచ్చింది కానీ నితిన్ ఎలాంటి కామియోలో నటిస్తున్నాడో తెలియాలంటే మరికొన్ని గంటలు ఎదురుచూడక తప్పదు. హరీష్ శంకర్ దర్శకత్వంలో వహించిన వాల్మీకి చిత్రంలో వెల్లువొచ్చి గోదారమ్మ పాటను రీమిక్స్ చేసిన సంగతి తెల్సిందే.

- Advertisement -

Credit: Twitter

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All