
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా , నిత్యామీనన్ , సంయుక్త మీనన్ జంటగా సాగర్ కె చంద్ర డైరెక్షన్లో మురళి శర్మ , సముద్ర ఖని ఇతర పాత్రల్లో తెరకెక్కిన మూవీ భీమ్లా నాయక్. థమన్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే , మాటలు అందించడం విశేషం. భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది.
కేవలం టాక్ మాత్రమే కాదు కలెక్షన్లు కూడా భారీ ఎత్తున వసూళ్లు చేస్తూ వస్తుంది. ఇక ఈ సినిమా చూసిన అభిమానులు, ప్రేక్షకులు సినిమా అంత ఓకే కానీ ఎంతో సూపర్ హిట్ అయినా అంత నీ ఇష్టం సాంగ్ ను చిత్రంలో లేకపోవడం అందర్నీ బాధకలిగిస్తుంది. దీనిపై చిత్రంలో పవన్ సరసన సుగుణ పాత్రలో నటించిన నిత్యా మీనన్ సైతం మేకర్స్ ఫై ఆగ్రహంగా ఉందట. అందుకే ప్రీ రిలీజ్ కు కానీ ప్రమోషన్ కు కానీ దూరంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో తన రోల్, తన డైలాగ్స్ ప్రేక్షకుల బాగా కనెక్ట్ అయ్యాయి. సో.. ఎలాగోలా ఆ పాట కూడా ఉండి ఉంటే ఇంకా బాగుండేదనేది ఆమె ఫీలింగ్.
నిత్యా మీనన్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి చాలా ఏళ్ళు అయినా కూడా తన నటన, ప్రతిభతోనే కెరీర్‌లో ముందుకు సాగిస్తోంది. ఏ మాత్రం అందాల ఆరబోతకు ఛాన్స్ ఇవ్వకుండానే ప్రేక్షకుల మనసు దోచుకుంటోంది. పాత్ర పరిధిని లెక్కలోకి తీసుకొని సినిమాలు చేస్తూ వస్తోంది. ఇదే బాటలో భీమ్లా నాయక్ కూడా చేసినట్లు తెలుస్తుంది.