
దిల్ సినిమాతో దిల్ రాజు నిర్మాత అయ్యాడు పైగా ఆ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టాడు కూడా అందులో హీరో నితిన్ . హీరోగా నితిన్ నటించిన మొదటి సినిమా జయం చాలా పెద్ద సక్సెస్ అయ్యింది దాని తర్వాత వెంటనే దిల్ రాజు – గిరి నిర్మాతలుగా పరిచయం అవుతూ వివివినాయక్ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం దిల్ ఇది కూడా పెద్ద హిట్ అయ్యింది . అయితే దిల్ రాజు తో నితిన్ మరిన్ని సినిమాలు చేయకుండా కొంతమంది కావాలని ఇద్దరి మధ్య పుల్లలు పెట్టారట దాంతో ఇరువురు కూడా ఎడమొహం పెడమొహం గా ఉన్నారు .
అయితే మళ్ళీ మధ్యలో సినిమాలు చేయాలనీ అనుకున్నారట కానీ అప్పుడు కూడా మధ్యలో కొంతమంది గొడవలు పెట్టించారట దాంతో మళ్ళీ సినిమా చేయడానికి ఇన్నాళ్లు పట్టిందని అంటున్నాడు నితిన్ . ఇప్పుడు ఏకంగా దిల్ రాజు బ్యానర్ లో వరుసగా రెండు సినిమాలు చేస్తున్నాడు నితిన్ . 14 ఏళ్ల విరామం తర్వాత వరుసగా రెండు సినిమాలు కమిట్ అయ్యాడు నితిన్ . శ్రీనివాస కళ్యాణం సకుటుంబ సపరివార సమేతంగా చూడతగ్గ చిత్రమని అంటున్నాడు నితిన్ . ఇక ఈ హీరో నటించిన చల్ మోహన్ రంగ ఏప్రిల్ 5 న విడుదల కానుంది .