Homeటాప్ స్టోరీస్పవన్ నితిన్ మాట వింటాడా

పవన్ నితిన్ మాట వింటాడా

nithin request to pawan kalyanనిన్న చల్ మోహన్ రంగ ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం జరిగింది , కాగా ఆ వేడుకలో నితిన్ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి ఓ కోరిక కోరాడు . సార్ …… దయచేసి సినిమాల్లో నటించను అని మాత్రం అనకండి ఎందుకంటే మీకు ఎప్పుడు వీలయితే అప్పుడు మా కోసం ఓ సినిమా చేయండి చాలు దానితో సర్దుకుంటామని అభిమానుల సమక్షంలో కోరాడు దానికి అభిమానుల నుండి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది .

అయితే నితిన్ మాట్లాడుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ నవ్వుతూ ఉన్నాడు కానీ ఆ తర్వాత మాట్లాడినప్పుడైనా సినిమాలలో నటిస్తాను అని మాత్రం చెప్పలేకపోయాడు పవన్ . నితిన్ హీరోగా నటించిన చల్ మోహన్ రంగ చిత్రానికి పవన్ కళ్యాణ్ కూడా ఒక నిర్మాత కావడం విశేషం . ఇక ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదల కానుంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All