Homeటాప్ స్టోరీస్నితిన్ ఎంగేజ్‌మెంట్ డేట్ ఫిక్స్‌!

నితిన్ ఎంగేజ్‌మెంట్ డేట్ ఫిక్స్‌!

నితిన్ ఎంగేజ్‌మెంట్ డేట్  ఫిక్స్‌!
నితిన్ ఎంగేజ్‌మెంట్ డేట్ ఫిక్స్‌!

టాలీవుడ్‌లో వున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్ చాలా మందే వున్నా అందులో పెళ్లి కోసం ఎదురుచూస్తున్న వాళ్ల సంఖ్య చాలా త‌క్కువే వుంది. మిగ‌తా హీరోలు పెళ్లి ఊసే ఎత్త‌డం లేదు. ఇదిలా వుంటే యంగ్ హీరో నితిన్ పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్న విష‌యం తెలిసిందే. గ‌త కొంత కాలంగా హైద‌రాబాద్ కు చెందిన ఎంబీఏ గ్రాడ్యుయేట్ షాలినితో ప్రేమ‌లో వున్న నితిన్ పెద్ద‌ల అంగీకారంతో పెళ్లికి రెడీ అయిపోతున్నాడు.

గ‌త నాలుగేళ్లుగా షాలినితో నితిన్ సీక్రెట్‌గా ప్రేమాయ‌ణాన్ని సాగిస్తున్నారు. వీరి ల‌వ్‌స్టోరీకి సంబంధించిన వార్త‌లు ఈ మ‌ధ్యనే బ‌య‌టికి వ‌చ్చాయి. రోజు రోజుకీ త‌న ప్రేమ‌, పెళ్లికి సంబంధించిన వార్త‌లు షికారు చేస్తున్నా నితిన్ మాత్రం సైలెంట్‌గా త‌న ప‌ని తాను చేసుకుంటూ పోతున్నారు. `భీష్మ‌` షూటింగ్‌లో బిజీగా వున్న నితిన్ మ‌రో ప‌క్క త‌న పెళ్లికి సంబంధించిన ఏర్పాట్ల‌ని చ‌క‌చ‌కా చేసుకుపోతున్నారు. దుబాయ్‌లో ఏప్రిల్ 16న‌ డెస్టినేష‌న్ వెడ్డింగ్‌కి అతిథుల‌ని ఫిక్స్ చేసిన నితిన్ త‌న ఎంగేజ్‌మెంట్ డేట్‌ని కూడా ఫైన‌ల్ చేసిన‌ట్టు తెలిసింది.

- Advertisement -

పెళ్లి కోసం ఏర్పాట్లు, అతిథుల లిస్ట్ ఫైన‌ల్ కావ‌డంతో ఈ నెల 15న ఎంగేజ్‌మెంట్‌కి ముహూర్తం ఫిక్స్ చేశార‌ట‌. హైద‌రాబాద్‌లో జ‌ర‌గ‌నున్న ఈ ఎంగేజ్‌మెంట్‌లో టాలీవుడ్‌కు చెందిన క్రేజీ స్టార్స్‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు పాల్గొన‌నున్నార‌ట‌.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All