
ఆ పాటల చిత్రీకరణలో రెయిన్ సీక్వెన్స్ కోసం వాడిన నీరు చాలా చల్లగా ఉండడమే అందుకు కారణం. వణికించేంత చల్లని నీటిలో తడుస్తూ పాటకి తగ్గ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ‘కట్’ చెప్పగానే చిత్ర బృందం నిరూప్, అవంతిక ల మీద వేడి నీళ్ళు పోసి, బ్లాంకెట్ కప్పాక కానీ మాములు స్థితి కి వచ్చేవారు కాదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా పెర్ఫెక్షనిస్ట్ గా పేరున్న దర్శకుడు అనూప్ తానూ అనుకున్న ‘పర్ఫెక్ట్ షాట్’ అనుకున్నట్లు వచ్చే వరకు రీటేక్ ల కి పిలిచేవారు. షూటింగ్ అయిపోయాక నిరూప్, అవంతిక లు చలి దెబ్బకి హీటర్ల ముందు ఒక అరగంట కూర్చుంటే కానీ వణుకు తగ్గేది కాదు. తర్వాతి రోజున షూటింగ్ కి ఇబ్బంది రాకూడదని జ్వరం తోనే షూట్ చేశారు. సినిమా చిత్రీకరణ ఎంతో కష్టం, శ్రమ తో కూడుకున్నది. ఇంత శ్రమ పడి చేశారు కాబట్టే ‘రాజరథం’ ట్రైలర్, పాటలు అంత అద్భుతంగా రాగలిగాయి. ప్రేక్షకులని ఇంతలా ఆకట్టుకోగలిగాయి. తమ మొదటి ప్రయత్నంలో నే ఉత్తమ నిర్మాణ విలువలతో మంచి సినిమా ని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్న ‘రాజా రథం’ టీం ని అభినందించాల్సిందే. అజయ్ రెడ్డి, అంజు వల్లభనేని, విషు దకప్పగారి, సతీష్ శాస్త్రి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ‘రాజరథం’ ఫిబ్రవరి 16 నుండి ప్రపంచవ్యాప్తంగా విడుదలకి సిద్ధంగా ఉంది.
- Advertisement -