
గత కొంతకాలంగా సరైన హిట్ లేని యంగ్ హీరో నిఖిల్ ..ప్రస్తుతం మూడు సినిమాలను లైన్లో పెట్టాడు. వాటిలో 18 పేజెస్ , కార్తికేయ 2 లు కాగా మరోటి సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటున్న ఈ మూవీకి ఇంకా టైటిల్‌ను ఖరారు చేయలేదు. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త ఫిలిం సర్కిల్లో చక్కర్లు కొడుతోంది.
ఈ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదివరకే పలు ఓటీటీ సంస్థలతో ఈ మూవీ మేకర్స్ చర్చలు జరిపారని, చివరకు జీ5 మంచి డీల్‌ను ఒప్పందం కుదుర్చుకున్నట్లు సినీ వర్గాల నుంచి సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం థియేటర్స్ ఓపెన్ అవ్వడం తో సినిమాలన్నీ థియేటర్స్ లలో విడుదలై అలరిస్తుండగా..నిఖిల్ సినిమాను ఓటిటి లో రిలీజ్ చేయడం ఏంటి అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.