Homeటాప్ స్టోరీస్కొత్త బాధ్య‌త‌తో షాకివ్వ‌బోతున్న యంగ్ హీరో!

కొత్త బాధ్య‌త‌తో షాకివ్వ‌బోతున్న యంగ్ హీరో!

కొత్త బాధ్య‌త‌తో షాకివ్వ‌బోతున్న యంగ్ హీరో!
కొత్త బాధ్య‌త‌తో షాకివ్వ‌బోతున్న యంగ్ హీరో!

క‌రోనా కార‌ణంగా చాలా మంది కొత్త రూట్‌ల‌ని వెతుక్కుంటున్నారు. కొత్త కొత్త ఆలోచ‌న‌ల‌తో కొత్త ప్ర‌య‌త్నాలు చేయ‌బోతున్నారు. యంగ్ హీరో నిఖిల్ కూడా ఇదే బాట‌లో ప‌య‌నించ‌బోతున్నాడ‌ట‌. క‌రోనా వీర విహారం చేస్తున్న స‌మ‌యంలో ప్రేమించిన అమ్మాయినే పెద్ద‌ల అంగీకారంతో పెళ్లి చేసుకున్న నిఖిల్ ప్ర‌స్తుతం వైవాహిక జీవితాన్ని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు.

షూటింగ్‌లు మొద‌లుపెట్ట‌డానికి, సెట్లో అడుగు పెట్ట‌డానికి స్టార్ హీరోలంతా జంకుతున్న వేళ కింగ్ నాగార్జున ముంద‌డుగు వేసి బిగ్‌బాస్ సీజ‌న్ 4 షూటింగ్‌తో పాటు త‌ను న‌టిస్తున్న యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `వైల్డ్ డాగ్‌` షూటింగ్‌ని కూడా ప‌ట్టాలెక్కించారు. దీంతో స్టార్ హీరోల‌తో పాటు యంగ్ హీరోలు కూడా త‌మ చిత్రాల్ని ప్రారంభించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. నిఖిల్ కూడా త‌ను న‌టిస్తున్న `కార్తికేయ 2`ని మొద‌లుపెట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.

- Advertisement -

ఇదిలా వుంటే నిఖిల్ కొత్త‌గా మెగా ఫోన్ ప‌ట్టి షాకివ్వ‌డానికి రెడీ అవుతున్న‌ట్టు తెలిసింది. ఇదే విష‌యాన్ని నిఖిల్ స్టార్ క‌మెడియ‌న్ ఆలీ నిర్వ‌హిస్తున్న `ఆలీతో స‌ర‌దాగా` కార్య‌క్ర‌మంలో వెల్ల‌డించారు. త‌ను త్వ‌ర‌లో మెగా ఫోన్ ప‌ట్ట‌బోతున్నాన‌ని, ఓ ప్ర‌యోగాత్మ‌క పిల్ల‌ల చిత్రాన్ని రూపొందించ‌బోతున్నాన‌ని వెల్లించాడం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. `హ్యాపీడేస్‌`కి ముందు నిఖిల్ `హైద‌రాబాద్ న‌వాబ్స్‌` చిత్రానికి అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ చేశారు. ఆ అనుభ‌వంతో పిల్ల‌ల చిత్రాన్ని తెరపైకి తీసుర‌కురానున్నార‌ట‌.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All