Friday, March 24, 2023
Homeటాప్ స్టోరీస్విజయ్ దేవరకొండ పై సంచలన వ్యాఖ్యలు చేసిన నిఖిల్

విజయ్ దేవరకొండ పై సంచలన వ్యాఖ్యలు చేసిన నిఖిల్

Nikhil comments on vijay devarakonda's tweet విజయ్ దేవరకొండ పై సంచలన వ్యాఖ్యలు చేసి షాక్ ఇచ్చాడు హీరో నిఖిల్ . నోటా పరాజయం పొందన నేపథ్యంలో కొంతమంది సంతోషపడ్డారని , పార్టీ చేసుకునే మూడ్ లో ఉన్నారని , కొన్ని తప్పులు జరిగినా మళ్ళీ సత్తా చూపిస్తానని నా ధోరణి మార్చుకునే ప్రసక్తిలేదని పెద్ద నోట్ రాసి సోషల్ మీడియాలో పెట్టాడు విజయ్ దేవరకొండ . అయితే దానికి పెద్దగానే కౌంటర్ ఇచ్చాడు యంగ్ హీరో నిఖిల్ . మనం పని చేసుకుంటూ వెళ్ళడమే తప్ప మన చేతుల్లో అంతా ఉందనుకోవడం వట్టి భ్రమే ! అవుతుంది . ప్రపంచం మొత్తాన్ని పభావితం చేస్తా అనే యాటిట్యూడ్ సరైంది కాదని , ఇక్కడ ఎవరూ అంత ప్రాముఖ్యత కాదని నేరుగా విజయ్ దేవరకొండ పైనే విమర్శలు చేసాడు . నువ్విక్కడ పెద్ద తోపు కాదు అని నెగెటివ్ గా తీసుకుంటే అర్ధం వచ్చేలా ఉంది . ఇక పాజిటివ్ గా తీసుకుంటే కేవలం మనం మన ఎఫెర్ట్ పెట్టి సినిమాల్లో నటించడం తప్ప ఫలితం మన చేతుల్లో లేదని చెబుతున్నాడు నిఖిల్ .

- Advertisement -

అయితే నిఖిల్ ట్వీట్ పట్ల విజయ్ దేవరకొండ అభిమానులు వైల్డ్ గా రియాక్ట్ అవుతున్నారు ఎందుకంటే నేరుగా విజయ్ దేవరకొండ ని ఇన్సల్ట్ చేసినట్లుగా నిఖిల్ ట్వీట్ ఉంది మరి . పాజిటివ్ గా తీసుకుంటే ఒకలా , నెగెటివ్ గా తీసుకుంటే మరోలా ఉంటుంది కాబట్టి ఈ గొడవ ఎలా మలుపులు తిరుగుతుందో చూడాలి . నోటా చిత్రం తెలుగు , తమిళ బాషలలో కూడా ఫ్లాప్ అయ్యింది . దాంతో విజయ్ దేవరకొండ కాస్త అసహనంతో ఉన్నాడు .

English Title: Nikhil comments on vijay devarakonda’s tweet

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts