Homeఎక్స్ క్లూసివ్ఆత్మహత్య చేసుకున్న యాంకర్

ఆత్మహత్య చేసుకున్న యాంకర్

News channel Anchor Radhika koushik commits suicideఈరోజు మధ్యాహ్నం మూడున్నరకు ప్రముఖ యాంకర్ రాధికా కౌశిక్ ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టించింది . టివి రంగంలో సంచలనం సృష్టించిన ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని నోయిడా లో జరిగింది . రాధికా కౌశిక్ ఓ న్యూస్ ఛానల్ లో యాంకర్ గా పనిచేస్తోంది , కాగా రాధికా కౌశిక్ మరో యాంకర్ రాహుల్ తో సన్నిహితంగా ఉంటోంది కొంతకాలంగా . దాంతో ఇద్దరూ కలిసి నోయిడా లోని ఓ అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ తీసుకొని సహజీవనం చేస్తున్నారు .

అయితే ఈరోజు ఉదయం నుండి ఇద్దరూ కలిసి ఫ్లాట్ లోనే మద్యం సేవిస్తూ ఉన్నారట ! మద్యం మత్తులో ఇద్దరి మధ్య వాదోపవాదాలు పెరగడంతో రాధికా కౌశిక్ ఫ్లాట్ నుండి కిందకు దూకేసి ఆత్మహత్య చేసుకున్నట్లు రాహుల్ చెబుతున్నాడు . పైగా రాధికా కౌశిక్ దూకే సమయంలో నేను వాష్ రూమ్ లో ఉన్నానని అందుకే కాపాడలేక పోయానని అంటున్నాడు . అయితే ఆమె ఆత్మహత్య చేసుకుందా ? లేక హత్య కు గురయ్యిందా ? అన్న విషయం తేలాల్సి ఉంది. ప్రస్తుతం రాహుల్ పోలీసుల అదుపులో ఉన్నాడు . ఇక రాధికా కౌశిక్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు .

- Advertisement -

English Title: News channel Anchor Radhika koushik commits suicide

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All