Homeటాప్ స్టోరీస్ఆంటీ తో ఎంజాయ్ చేస్తున్నాడు కానీ మరి పెళ్లి ?

ఆంటీ తో ఎంజాయ్ చేస్తున్నాడు కానీ మరి పెళ్లి ?

45 ఏళ్ల ఆంటీ మలైకా అరోరా తో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నాడు యంగ్ హీరో అర్జున్ కపూర్ . అసలు ఈ నెల 19 న ఈ ఇద్దరి పెళ్లి అని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది కానీ పెళ్లి మాత్రం కాలేదు దాంతో మలైకా తో తిరుగుతున్నారు బాగానే ఉంది మరి పెళ్ళెప్పుడు ? అని ప్రశ్నించినప్పుడు నా పెళ్లి కి అంత తొందర లేదు పైగా నాది పెళ్లి చేసుకునే వయసు కూడా కాదు అంటూ కొంటెగా సమాధానం ఇచ్చాడు అర్జున్ కపూర్ .

- Advertisement -

అంతేనా …… నా గురించి , మలైకా గురించి రకరకాల కథనాలు రాస్తున్నారు , రాసేవాళ్ళు రాసుకుంటారు , చదివే వాళ్ళు చదువుకుంటారు ( పాఠకులు) కాబట్టి నేను ఎవరినీ తప్పు పట్టను కానీ వాస్తవం ఏంటి అన్నది మెల్లి మెల్లిగా తెలుస్తుంది అంటూ వేదాంత ధోరణిలో మాట్లాడాడు అర్జున్ కపూర్ . మలైకా అరోరా కు 45 ఏళ్ళు కాగా అర్జున్ కపూర్ కు 33 ఏళ్ళు . ఈ ఇద్దరి మధ్య 12 ఏళ్ల తేడా ఉన్నప్పటికీ ఎంజాయ్ చేయడానికి వయసు అడ్డంకి కాదని , చిన్నా – పెద్దా అనేది కూడా అడ్డు కాదని తేల్చి చెబుతున్నారు . మొత్తానికి ఆంటీ తో ఎంజాయ్ చేస్తున్నాడు కానీ పెళ్లి గురించి అడిగితె మాత్రం వేదాంతం మాట్లాడుతున్నాడు ఈ హీరో .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All