Homeటాప్ స్టోరీస్“కాదలే.. కాదలే” తెలుగులో “ప్రాణం.. నా ప్రాణం”

“కాదలే.. కాదలే” తెలుగులో “ప్రాణం.. నా ప్రాణం”

“కాదలే.. కాదలే” తెలుగులో “ప్రాణం.. నా ప్రాణం”
“కాదలే.. కాదలే” తెలుగులో “ప్రాణం.. నా ప్రాణం”

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి సహజ నటి త్రిష జంటగా నటించిన 96 మూవీ గురించి ఇప్పటికీ మనం ఎన్నో సార్లు మాట్లాడుకున్నాం. ఒక మంచి సినిమా గురించి ఒక గొప్ప సినిమా గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఎందుకంటే అక్షరమైనా, సినిమా అయినా మనలో తపన ఉంటే చదివిన ప్రతిసారి చూసిన ప్రతిసారి ఏదో కొత్త విషయం మనతో చెప్తూ ఉంటుంది. అలాంటి గొప్ప కళ సినిమా. ప్రతి సినిమాలో ఉండే సోల్ కి మనం కనెక్ట్ అయితే, భాషతో సంబంధం లేకుండా నటించిన నటీనటులతో సంబంధం లేకుండా చూసి ఆనందిస్తాం. ఆ సినిమాని మన గుండెల్లో పెట్టుకుంటాం. గుండె బరువెక్కి నప్పుడల్లా గుర్తు చేసుకుంటాం. అలాంటి ఎమోషనల్ లవ్ స్టోరీ అయిన 96 ను ఇప్పుడు ప్రముఖ నిర్మాత దిల్ రాజు గారు తెలుగులో పునర్నిర్మిస్తున్నారు. శర్వానంద్, సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకి ఇటీవలే “జాను” అనే టైటిల్ ను ఖరారు చేశారు.96 సినిమా అంటే ఎక్కువ మంది మాట్లాడుకునేది ఆ సినిమాలో హిట్ అయిన కాదలే కాదలే పాట గురించే. ఇప్పటికీ ఎన్నో సంగీత వేదికలపై ఆ పాటను లైవ్ లో విన్నప్పుడు మన కళ్ళు తెలియకుండానే వర్షిస్తాయి. మ్యూజిక్ కి ఉండే మ్యాజిక్ ఎంతైనా వేరు.

ఇప్పుడు ఆ పాటకు తెలుగు వెర్షన్ అయిన “ప్రాణం.. నా ప్రాణం” అనే పాటను రిలీజ్ చేశారు. సాహిత్య సవ్యసాచి శ్రీమణి గారు రచించిన ఈ పాటను చిన్మయి గౌతమ్ భరద్వాజ్ పాడారు. 96 మూవీ తమిళ వెర్షన్ మ్యూజిక్ డైరెక్టర్ గోవింద్ వసంత గారు తెలుగులో కూడా ఈ సినిమాకు సంగీతం అందించారు. 1996 సంవత్సరంలో స్కూల్లో చదువుకున్న బ్యాచ్ గెట్ టు గెదర్ అయిన సందర్భంలో; అప్పుడు ఇష్టపడ్డ ఒక జంట మళ్లీ కలిస్తే ఎలా ఉంటుంది.? అనే కథాంశంతో 96 సినిమా రూపొందించారు. మరి తెలుగు వెర్షన్ కి సంబంధించి కథలో ఏమైనా మార్పులు చేశారా.? లేదంటే అలాగే తీశారా అన్న విషయం తెలియాల్సి ఉంది. తమిళం 96 వెర్షన్ కు డైరెక్షన్ చేసిన సీ. ప్రేమ్ కుమార్ గారు ఈ సినిమా తెలుగు వెర్షన్ కు సైతం దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ప్రస్తుతం రిలీజ్ అయిన ప్రాణం నా ప్రాణం.. నీతో ఇలా గానం తొలి గానం.. పాడే వేళ మన దూరమే అమావాస్యలే చెరో కథై ఇలా అంటూ సాగే ఈ పాట యొక్క డెప్త్ మీనింగ్ & డీప్ ఫిలాసఫీ గురించి ఖచ్చితంగా ఇంకొకసారి మాట్లాడుకుందాం.

- Advertisement -

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All