Homeటాప్ స్టోరీస్ఆర్జీవీ ఏకలవ్య శిష్యుడు ఫణికుమార్ అద్దేపల్లి 'ట్రావెలింగ్ సోల్జర్'

ఆర్జీవీ ఏకలవ్య శిష్యుడు ఫణికుమార్ అద్దేపల్లి ‘ట్రావెలింగ్ సోల్జర్’

ప్రకటనల రంగంలో మంచి అనుభవం కలిగిన యువ ప్రతిభాశాలి, రాంగోపాల్ వర్మ ఏకలవ్య శిష్యుడు ఫణికుమార్ అద్దేపల్లి సినిమా రంగంలో ప్రవేశిస్తున్నారు. ఆయన దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. ఆ చిత్రం పేరు ‘ట్రావెలింగ్ సోల్జర్’. వినాయక మూవీస్ పతాకంపై అంగముత్తు రాజా నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ కి వెళ్లనుంది. గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ కి ప్రాధాన్యతనిస్తూ.. అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో వినోదంతోపాటు సందేశం కూడా మిళితమై ఉంటుందని ఫణికుమార్ అద్దేపల్లి చెబుతున్నారు. ప్రస్తుతం నటీనటులు, సాంకేతిక నిపుణల ఎంపిక జరుపుకుంటున్న ఈ చిత్రానికి మాటలు: చిట్టిరాజు, వీఎఫెక్స్: ప్రణీత్, నిర్మాత: అంగముత్తు రాజా, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఫణికుమార్ అద్దేపల్లి!!

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All