
తమిళ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ ప్రస్తుతం తమిళంలో కాతువాకుల రెండు కాధల్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ లో విజయ్ సేతుపతి , నయనతార , సమంత లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ట్రయాంగిల్ లవ్‌స్టోరీ గా రాబోతున్న ఈ మూవీ ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి టూ..టూ..టూ అంటూ సాగే సాంగ్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అనిరుధ్ కంపోజ్ చేసిన మ్యూజిక్ అందరినీ షేక్ చేయడం గ్యారంటీ అని ప్రోమోతోనే తెలిసిపోతుంది. అయితే ఈ సాంగ్ విడుదల తర్వాత విగ్నేష్ ఫై సమంత ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉన్నారు.
పాటలో నయనతార ట్రెడిషనల్ శారీ లుక్‌లో, సమంత పొట్టిడ్రెస్‌లో కనిపిస్తున్నారు. అయితే ఇక్కడే విఘ్నశ్ శివన్ (నయన్ బాయ్‌ఫ్రెండ్) ఆలోచన బయటపడింది. తనకు కాబోయే భార్య నయనతారను సంప్రదాయక లుక్‌లో చూపించి..సమంతను అలా చూపించడం కొందరికి మింగుడుపడటం లేదు. దీంతో విగ్నేష్ ఫై పలు కామెంట్స్ చేస్తున్నారు.