
సోషలల్ మీడియాలో ఏది షేర్ చేయాలన్నా.. ట్వీట్ చేయాలన్నా సెలబ్రిటీలే కాదు కామన్‌మెన్ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటాడు. ఎక్కడ స్లప్పయితే ట్రోల్స్‌కి దొరికి పోతామని అని భయపడుతుంటారు. ఇవన్నీ తెలిసి కూడా నటుడు బ్రహ్మాజీ ట్వీటేశారు.. అడ్డంగా బుక్కయ్యారు. వివరాల్లోకి వెళితే.. ఇటీవల హైదరాబాద్‌లో కురిని వర్షాలకు హైదరాబాద్ ఓ జలాశయంగా మారింది. ఎక్కడ ఏ వీధి చూసినా నీళ్లే.
కొన్ని ఏరియాల్లో అయితే కార్లే బోట్‌లుగా మారిపోయియా. వరదల్లో కొన్ని కార్లు కొట్టుకుపోయాయి కూడా. కొన్ని బైక్‌లు వరద బురదలో కూరుకుపోయాయి. ఇదిలా వవుంటే దీనిపై కొంత మంది నెటిజన్స్ మీమ్స్ పెడుతూ సందడి చేస్తున్నారు. ఇది చూసిన బ్రహ్మాజీ తన ఇళ్లు కూడా వరద నీటిలో వుందని, ఇంటి ముందు కార్లు నీటిలో తేలియాడుతున్నాయని కొన్ని ఫొటోలని ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ఇదీ నా ఇంటి పరిస్థితి.. ఓ పడవ కొనాలనుకుంటున్నాను. ఎవరైనా మంచి పసడవ గురించి చెప్పండి అని ట్వీటేశాడు.
అడ్డంగా బుక్కయ్యాడు. బ్రహ్మాజీ కామెడీని సీరియస్‌గా తీసుకున్న ఆయన ఫాలోవర్స్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చెన్నైలో వరదలు వస్తే టాలీవుడ్ సెలబ్రిటీలు విరాళాలు ప్రకటించారని, అదే హైదరాబాద్ లో వరదలు వస్తే సిల్లీ జోక్స్‌తో కామెడీ చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇలాంటి జోకులని పక్కన పెట్టి సిటీకి ఏం చేయాలో ఆలోచించండి అంటూ బ్రహ్మాజీపై విరుచుకుపడుతున్నారు.