Homeటాప్ స్టోరీస్`నేను లేను` ట్రైలర్ కు 1 మిలియన్ వ్యూస్

`నేను లేను` ట్రైలర్ కు 1 మిలియన్ వ్యూస్

nenu lenu movie teaser one million viewsఓ.య‌స్‌.యం విజన్ – దివ్యాషిక క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం `నేను లేను`. `లాస్ట్ ఇన్ లవ్` అనేది ఉప‌శీర్షిక‌. హ‌ర్షిత్ హీరో. ఈ చిత్రం ట్రైలర్ ఇటీవలె విడుదలై వన్ మిలియన్ వ్యూస్ ను అందుకుంది. ఫిబ్రవరి 1 విడుదలవుతున్న ఈ చిత్రం గురించి ద‌ర్శ‌కుడు రామ్ కుమార్ మాట్లాడుతూ -“ఒక అందమైన ప్రేమకథతో తెర‌కెక్కిన‌ సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ ర‌క్తి క‌ట్టిస్తుంది. ఇటివలే విడుదలైన ట్రైలర్ కి అనూహ్య స్పంద‌న వ‌చ్చింది. 1 మిలియన్ వ్యూస్ ను మా ట్రైలర్ రీచ్ అయింది.రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా థ్రిల్లింగ్ కాన్సెప్టుతో తీసిన సినిమా ఇది. ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు అనే నమ్మకం ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఫిబ్ర‌వ‌రి 1 సినిమాను విడుదల చేస్తున్నాం. ఇండియన్ సినిమా స్క్రీన్ పై ఇప్పటివరకు రానీ చూడని సరికొత్త కాన్సెప్ట్ తో వస్తున్న చిత్రమిద‌ని అన్నారు.

హ‌ర్షిత్‌, వంశీకృష్ణ‌ పాండ్య‌, శ్రీ‌ప‌ద్మ‌, మాధ‌వి, బిశ్వ‌జిత్‌నాధ్‌, రుద్ర‌ప్ర‌కాశ్‌, వేల్పుల‌ సూరి, యుగంధ‌ర్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:ఆశ్రిత్‌, ఛాయాగ్ర‌హ‌ణం:ఎ. శ్రీ‌కాంత్ (బి.ఎఫ్‌.ఎ), నృత్యాలు: జోజో, నిర్వాహ‌ణ: సురేష్‌కూర‌పాటి, పి.ఆర్‌.ఓ‌:సాయి స‌తీష్ పాల‌కుర్తి, విఎఫ్ఎక్స్: ప్రభురాజ్‌, ఎస్.ఎఫ్.ఎక్స్:పురుషోత్తం రాజు, ఆడియోగ్ర‌ఫీ:రంగ‌రాజ్‌, క‌ల‌రిస్ట్ః క‌ళ్యాణ్ ఉప్పాల‌పాటి, ప్ర‌చార చిత్రాలు: శ్రీ‌క‌, స‌హాయ‌ద‌ర్శ‌కులు: జె.మోహ‌న్‌కాంత్‌, ద‌ర్మేంద్ర‌, సురేశ్‌, స‌హ‌నిర్మాత : య‌షిక, నిర్మాత : సుక్రి కుమార్, రచన- దర్శకత్వం : రామ్ కుమార్ ఎమ్.ఎస్.కె

- Advertisement -

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All