
డీజే టిల్లు సినిమాతో హీరోయిన్ నేహా శెట్టి యూత్ లో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం యువ హీరో కార్తికేయ హీరోగా నటిస్తోన్న కొత్త చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైన సంగతి తెలిసింది. డీజే టిల్లు సక్సెస్ తో వచ్చిన అవకాశం ఇది. అయితే ఈ భామ కు లోలోపల మాత్రం మహేష్..రామ్ చరణ్…బన్నీ లాంటి స్టార్ హీరోలతో కలిసి పనిచేయాలని టార్గెట్ గా పెట్టుకుందిట.
అయితే ఈ విషయాలు ఎక్కడా ఓపోన్ అవ్వకుండా జాగ్రత్తపడుతుందిట. ఇదే సమయంలో వచ్చిన మీడియం రేంజ్ హీరోల్ని వదిలి పెట్టకూడదని భావిస్తోంది. మీడియా హీరోలతో జోడి కడుతూనే పెద్ద హీరోల పక్కన నటించాలని చూస్తుందట. మరి ఈ భామ కోరిక ఎప్పుడు తీరుతుందో చూడాలి. బన్నీ సరసన మాత్రం ఓ యాడ్ లో నటించింది. వెండితెర ఛాన్స్ కోసం గట్టిగానే ఎదురుచూస్తుంది.
- Advertisement -