Homeటాప్ స్టోరీస్#NC22 మూవీ ప్రకటన

#NC22 మూవీ ప్రకటన

NC22 movie announcement
NC22 movie announcement

వరుస హిట్స్ తో దూసుకెళ్తున్న నాగ చైతన్య ఈరోజు తన 22 వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. కోలీవుడ్ లో విలక్షణ దర్శకుడిగా పేరున్న వెంకట్ ప్రభు డైరెక్షన్లో చైతు తన 22 వ చిత్రాన్ని చేయబోతున్నట్లు తెలిపారు. ‘గోవా’ ‘సరోజ’ ‘గ్యాబ్లింగ్’ ‘రాక్షసుడు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు వెంకట్ సుపరిచితమే.

ఈ సందర్భాంగా ప్రభు సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ..తాను దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం తెలుగు, తమిళం ద్విభాషా చిత్రంగా ఉంటుందని వెల్లడించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తర్వాత వెల్లడికానున్నాయి. కాగా కమర్షియల్ హంగులతో కూడిన ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్‌ని దర్శకుడు చైతన్య కోసం రెడీ చేశాడని అంటున్నారు.

- Advertisement -

ఇక చైతు ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థాంక్యూ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా హాకీ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తుంది. అంతే కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు వీరాభిమానిగా చైతన్య కనిపించనున్నాడట. ఈ సినిమాలో నాగచైతన్య కు జోడీగా బాబ్లీ బ్యూటీ రాశిఖన్నా నటిస్తుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All