
నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్. ఉగాది రోజున బాలయ్య 107 మూవీ నుండి అదిరిపోయే గిఫ్ట్ రాబోతున్నట్లు సమాచారం. అఖండ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బాలకృష్ణ..ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తన 107 మూవీ చేస్తున్నాడు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రీసెంట్ గా క్రాక్ సినిమాతో హిట్ కొట్టిన గోపీచంద్ మాలినేని బాలకృష్ణ కోసం ఓ పవర్ ఫుల్ కథను సిద్ధం చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి బాలయ్య లుక్ ను రిలీజ్ చేశారు. ఈ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
ఇదిలా ఉంటె ఉగాది పండగ సందర్భంగా బాలయ్య అభిమానులను ఖుష్ చేయడానికి సిద్ధమయ్యారు మేకర్స్. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ను ఉగాది సందర్భగా రిలీజ్ చేయనున్నారట.. టైటిల్ ను సైతం ఈ సందర్భంగా అనౌన్స్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. సిరిసిల్ల ప్రాంతంలో ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేశారు. అలాగే ఈ సినిమాలో బాలకృష్ణ తెలంగాణ యాసలో మాట్లాడనున్నారని టాక్.