
శ్యామ్ సింగరాయ్ మూవీ తో సూపర్ హిట్ అందుకున్న నేచురల్ స్టార్ నాని..ప్రస్తుతం వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో అంటే సుందరానికి అనే మూవీ చేస్తున్నాడు. బ్రోచేవారేవరురా సినిమాతో హిట్ అందుకున్న వివేక్ ఆత్రేయ ఈ మూవీ లో నాని ని డిఫరెంట్ గా చూపించబోతున్నాడు. ఇందులో నాని సరసన మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా తో తెలుగు ఇండస్ట్రీ లో అడుగుపెడుతున్న ఈ భామ ..ఈ మూవీ ఫై భారీ ఆశలే పెట్టుకుంది.
ఈ తరుణంలో ఈమె తాలూకా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ముహూర్తం ఖరారు చేసారు. సినిమాలో ఈమె లీలా థామస్ గా కనిపించబోతున్నట్లు తెలుపుతూ..ఈమె తాలూకా ఫస్ట్ లుక్ ను రేపు (మార్చి 17) సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ అధికారిక ప్రకటన చేసారు. మరి ఆ లుక్ లో ఆమె ఎలా ఉంటుందో చూడాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 10 న రిలీజ్ కాబోతుంది.