Homeటాప్ స్టోరీస్ప్రభుదేవా తో నయనతార

ప్రభుదేవా తో నయనతార

nayanatara acting in prabhudeva filmఒకప్పుడు నయనతార – ప్రభుదేవా ఘాడంగా ప్రేమించుకున్నారు , పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు . దాంతో తన భార్యకు బలవంతంగా విడాకులు ఇచ్చాడు ప్రభుదేవా కానీ తీరా సమయానికి పెళ్లి పెటాకులు అయ్యింది దాంతో అప్పటి నుండి ప్రభుదేవా అంటే నయనతార కు విపరీతమైన కోపం . ఆ కోపం ఎంతగా అంటే కావాలంటే శింబు తోనైనా నటిస్తాను కానీ ప్రభుదేవా తో నటించడం కానీ అతడి దర్శకత్వంలో నటించడం కానీ చేసేది లేదని అడగకముందే చెప్పి అతడి పై ఉన్న కోపాన్ని తెలియజేసింది నయనతార .

అలాంటి నయనతార ఇపుడు ప్రభుదేవా దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతోందట . తమిళ స్టార్ హీరో అజిత్ సరసన నయనతార అయితే బాగుంటుంది అని భావించాడట ప్రభుదేవా . ఇటీవలే అజిత్ తో ఓ సినిమా చేయడానికి ప్రభుదేవా సిద్ధం అవుతున్నాడు ఆ చిత్రంలో నయనతార హీరోయిన్ . అయితే ప్రస్తుతం చర్చల దశలోనే ఉంది నయనతార గ్రీన్ సిగ్నల్ ఇస్తే అధికారికంగా ప్రకటిస్తారు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All