Homeటాప్ స్టోరీస్బిగ్ బాస్ 2 హోస్ట్ గా నాని ఫిక్స్

బిగ్ బాస్ 2 హోస్ట్ గా నాని ఫిక్స్

natural star nani fix bigg boss 2యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యానంతో మొదటి తెలుగు బిగ్ బాస్ బుల్లితెరపై సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే . కాగా ఇప్పుడు రెండో సీజన్ రెడీ అవుతోంది , జూన్ నుండి ఈ రెండో సీజన్ మొదలు కానుండగా అసలు ఈ రెండో సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించేది ఎవరనే ప్రశ్న ఉదయించగా నేను అంటూ నాని ముందుకు వచ్చాడు . ఎన్టీఆర్ మొదటి సీజన్ ని బాగా రక్తి కట్టించాడు అయితే ఇప్పుడు రెండో సీజన్ నుండి మాత్రం తప్పుకున్నాడు దాంతో అల్లు అర్జున్ , నాని ల పేర్లు ముందుకు వచ్చాయి . కట్ చేస్తే నాని బిగ్ బాస్ 2 కి ఫిక్స్ అయ్యాడు .

నాని హీరో కాకముందు హోస్ట్ గా వ్యవహరించాడు దాంతో బిగ్ బాస్ 2 ని మరింతగా రక్తికట్టించడం ఖాయమని అంటున్నారు . ఇక హీరోగా వరుస సక్సెస్ లు సాధిస్తున్న నేపథ్యంలో కృష్ణార్జున యుద్ధం తో ప్లాప్ అందుకున్నాడు నాని . ఒకవైపు సినిమాలు చేస్తూనే గ్యాప్ లో బిగ్ బాస్ 2 తో బుల్లితెర ప్రేక్షకులను పలకరించనున్నాడు నాని .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All