Homeటాప్ స్టోరీస్నేచుర‌ల్ స్టార్ 2020 ప్లాన్ అదుర్స్‌!

నేచుర‌ల్ స్టార్ 2020 ప్లాన్ అదుర్స్‌!

నేచుర‌ల్ స్టార్ 2020 ప్లాన్ అదుర్స్‌!
నేచుర‌ల్ స్టార్ 2020 ప్లాన్ అదుర్స్‌!

గ‌త ఏడాది స్పోర్ట్స్ డ్రామా `జెర్సీ`, క్రైమ్ థ్రిల్ల‌ర్ `గ్యాంగ్ లీడ‌ర్` వంటి చిత్రాల‌తో ఆక‌ట్టుకున్న నాని ఈ ఏడాది మాత్రం వ‌రుస‌గా మూడు చిత్రాల‌తో ప్రేక్ష‌కుల్ని ఎంట‌ర్‌టైన్ చేయ‌బోతున్నారు. రెగ్య‌ల‌ర్ పంథాకు పూర్తి భిన్నంగా నాని సినిమాల ప‌రంప‌ర సాగ‌బోతోంది. కొంచెం కొత్త‌గా కొత్త త‌ర‌హా పాత్ర‌ల్లో న‌టిస్తున్నారాయ‌న‌. నాని న‌టిస్తున్న తాజా చిత్రం `వి`. మోహ‌న్ కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌కత్వంలో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సుధీర్‌బాబు మ‌రో హీరోగా న‌టిస్తున్నారు. ఇందులో నాని తొలిసారి రాక్ష‌సుడి త‌ర‌హా నెగెటివ్ షేడ్స్ వున్న పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. ఈ నెల 27న `ర‌క్ష‌కుడు` లుక్‌ని, 28న నానికి సంబంధించిన రాక్ష‌సుడు లుక్‌ని రిలీజ్ చేయ‌బోతున్నారు. ఇదిలా వుంటే శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో `ట‌క్ జ‌గ‌దీష్‌` చిత్రాన్ని అంగీక‌రించిన నాని తాజాగా మ‌రో యంగ్ డైరెక్ట‌ర్‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలిసింది.

- Advertisement -

విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో `టాక్సీవాలా` చిత్రాన్ని రూపొందించి తొలి ప్ర‌య‌త్నంలోనే స‌క్సెస్ సాధించారు రాహుల్ సంక్రీత్య‌న్‌. ఈ యంగ్ డైరెక్ట‌ర్‌తో నాని ఓ సినిమా చేయ‌బోతున్నారు. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఎస్‌. రాధాకృష్ణ నిర్మించ‌బోతున్నారు. దీనికి సంబంధించిన అఫీషియ‌ల్ న్యూస్ త్వ‌ర‌లోనే బ‌య‌టికి రానుంది. ఇలా ఈ ఏడాది వ‌రుస‌గా మూడు చిత్రాల్ని నాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ ప్లానింగ్ చూసిన వాళ్లంతా నేచుర‌ల్ స్టార్ 2020 ప్లాన్ అదుర్స్ అంటున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All