Homeటాప్ స్టోరీస్నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఉత్సవాలు

నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఉత్సవాలు

nata-short-film-festivalఅంతర్జాతీయ ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్

(NATA- ఉత్తర అమెరికా తెలుగు సమితి) ఉత్సవాలు

- Advertisement -

జులై 6 వ తేదీ నుంచి 8వ తేదీ వరకు అమెరికాలోని, ఫిలడెల్ఫియా నగరంలో అత్యంత వైభవంగా జరగ నున్నాయి.

ఇందులో భాగంగా ఎంతో ప్రతిభ కలిగిన లఘు చిత్ర నటీ నటులు,దర్శకులు మరియు సాంకేతిక నిపుణులను ప్రోత్సహించాలనే సదుద్దేషంతో నాటా వారు లఘు చిత్ర పోటీలను నిర్విహిస్తున్నారని నాటా లఘు చిత్రాల సమన్వ్యయ కర్త శివ మేక, మహేందర్,ఉదయ్ గారు తెలిపారు.

ప్రముఖ దర్శకులు వంశీ ,హరీశ్ శంకర్ ,మధుర శ్రీధర్, మహి వి రాఘవ్ ,డాక్టర్ ఆనంద్ న్యాయ నిర్నేతలుగా వ్యవహరించనున్నారు.

ఇండియా నుంచి నాటా తరుపున డైరెక్టర్ డా.ఆనంద్ ఒక పత్రికా ప్రకటనలో మాట్లాడుతూ, అంతర్జాతీయ వేదికపై ,అతిరథ మహా రథుల సమక్షంలో జరగ బోయే ఈ కన్వెన్షన్‌లో ప్రపంచం నలు మూలల నుంచి ఎంతో మంది సినీ,రాజకీయ ప్రముఖులు పాల్గొననున్నారని,ప్రతిభ కలిగిన యువ ఫిల్మ్ మేకర్స్ అందరూ ఈ కాంటెస్ట్ లో పాల్గొనాలని కోరారు. విజేతలకు లక్ష రూపాయల వరకు బహుమతులు వుంటాయని, అలాగే స్పెషల్ జ్యూరీ అవార్డ్ లు, ప్రశంసా పత్రాలను అందజేయడం జరుగుతుందని తెలిపారు.

షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అందరూ తమ తమ చిత్రలను నాటా వారి వెబ్ సైట్ లో కాని,ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా గానీ,

రిజిస్టర్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు.

http://www.nata2018.org/event/event_view/2

లఘు చిత్రాలను పంప వలసిన చివరి తేదీ జూన్ 30 వ తేదీ.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All